Sankranthiki Vasthunam Box Office : వెంకటేష్ మాస్ జాతర .. ఇక్కడ 200 కోట్లు.. అక్కడ 260 కోట్లు ఔట్

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఓ రేంజ్ విక్టరీ కొట్టింది. ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచేలా ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మూడు రోజుల్లోనే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను పంచిపెట్టి పలువురికి ఊరట కలిగించింది. రెండ్రోజుల్లో మూడో వారం కూడా ముగియనుండగా, 19వ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 19

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.

ఓపెనింగ్స్‌తోనే తన విధ్వంసం ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన వెంకటేష్ నాటి నుంచి నేటి వరకు బాక్సాఫీస్‌ను వణిస్తూనే ఉన్నాడు. చూస్తుండగానే రూ.100 కోట్లు, రూ.200 కోట్లను కొట్టేసిన వెంకీ ఇప్పటి వరకు రూ. 100 కోట్లకు పైగా లాభాలను పంచి పెట్టాడు. భారీ డిజాస్టర్‌లతో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న దిల్‌రాజుకు ఉపశమనం కలిగించింది సంక్రాంతికి వస్తున్నాం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా లాంగ్ రన్‌లో అందించే ప్రాఫిట్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

ఇకపోతే.. 18 రోజుల వరకు నైజాంలో రూ.39.26 కోట్లు, సీడెడ్‌లో రూ.17.33 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.20.63 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.10 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.44 కోట్లు, గుంటూరులో రూ.10 కోట్లు, కృష్ణాలో రూ.9.17 కోట్లు, నెల్లూరులో రూ. 4.42 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 122.35 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.18 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 15.95 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్లు గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 19

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ పలు రికార్డులు బద్ధలు కొడుతున్నాడు. ఇందులో కొన్ని నాన్ బాహుబలి రికార్డులు కూడా ఉన్నాయి. ఇప్పటికే రంగస్థలం, సైరా నర్సింహారెడ్డి రికార్డులను అధిగమించిన వెంకటేష్ మరో ఘనతను అందుకున్నాడు. 18వ రోజు కూడా కోటికి పైగా షేర్ అందుకున్న హీరోల లిస్ట్‌లో చేరాడు. 18వ రోజు రూ.3.51 కోట్ల షేర్‌తో పుష్ప 2 ది రూల్ ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉంది.

ఇక 19వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే శనివారం నుంచి వీకెండ్ ప్రారంభం కావడంతో సాయంత్రం నుంచి అన్ని చోట్ల మంచి హోల్డ్ సాధించింది సంక్రాంతికి వస్తున్నాం. మొత్తంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 3 కోట్ల గ్రాస్ అందుకుంది. ఆదివారం కలెక్షన్లు మరింత పుంజుకుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X