Sankranthiki Vasthunam Box Office : వెంకటేష్ హిస్టారికల్ రికార్డ్ .. సండే కలెక్షన్ల జాతర, ఎన్ని కోట్లంటే?

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం కనివినీ ఎరుగని వసూళ్లతో ఈ ఏడాది సంక్రాంతి హిట్‌గా నిలిచింది. వెంకటేష్ నటన, బుల్లిరాజు మెరుపులు, పాటలు, అనిల్ రావిపూడి టేకింగ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. మూడో వారం చివరికి చేరుకున్నప్పటికీ.. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి వసూళ్లు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో 20వ రోజు వెంకటేష్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 20

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.

కేవలం మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చిన ఈ సినిమా చూస్తుండగానే రూ.100 కోట్లు, రూ.200 కోట్లను కొట్టేసి రూ.300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటి వరకు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు రూ. 100 కోట్లకు పైగా లాభాలను పంచి పెట్టింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి చిత్ర యూనిట్‌కు పార్టీ ఇచ్చి.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు. పీకల్లోతు నష్టాల్లో ఉన్న తమను ఈ సినిమా ఒడ్డున పడేసిందని నిర్మాత నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు చెబుతున్నారంటే సంక్రాంతికి వస్తున్నాం ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో చెప్పొచ్చు.

ఇకపోతే.. 18 రోజుల వరకు నైజాంలో రూ.39.84 కోట్లు, సీడెడ్‌లో రూ.17.61 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.20.97 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.24 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.53 కోట్లు, గుంటూరులో రూ.10.05 కోట్లు, కృష్ణాలో రూ.9.23 కోట్లు, నెల్లూరులో రూ. 4.47 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 123.94 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.20 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్లు గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది. మొత్తంగా రూ.150 కోట్ల షేర్‌తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్మురేపుతోంది.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 20

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ పలు రికార్డులు బద్ధలు కొడుతున్నాడు. ఇందులో కొన్ని నాన్ బాహుబలి రికార్డులు కూడా ఉన్నాయి. ఇప్పటికే రంగస్థలం, సైరా నర్సింహారెడ్డి రికార్డులను అధిగమించిన వెంకటేష్ కేవలం 20 రోజుల్లోనే రూ. 150 కోట్ల షేర్ రాబట్టిన ఘనతను అందుకున్నాడు.

ఇక 20వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే వీకెండ్‌లో సంక్రాంతికి వస్తున్నాం కుమ్మిపడేసింది. క్లాస్, మాస్ సెంటర్స్‌లో హౌస్‌ఫుల్ బోర్డులు పడటంతో మొత్తంగా ఆదివారం ప్రపంచవ్యాప్తంగా రూ. 5 కోట్ల గ్రాస్ అందుకుని ఎక్స్‌లెంట్ హోల్డ్ చూపించింది. సోమవారం నుంచి వర్కింగ్ డే ప్రారంభం కావడంతో వెంకటేష్ సినిమా ఎలాంటి ప్రభావం చూపెడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X