Sankranthiki Vasthunam Box Office : 303 కోట్లతో సంచలనం .. కలెక్షన్స్‌లో వెంకటేష్ ఆల్‌టైం రికార్డ్
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా, అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. ఈ నేపథ్యంలో 21వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.
కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు రూ. 120 కోట్లకు పైగా లాభాలను పంచి పెట్టింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ పలు రికార్డులు బద్ధలు కొడుతున్నాడు. ఇందులో కొన్ని నాన్ బాహుబలి రికార్డులు కూడా ఉన్నాయి. ఇప్పటికే రంగస్థలం, సైరా నర్సింహారెడ్డి రికార్డులను అధిగమించిన వెంకటేష్ కేవలం 20 రోజుల్లోనే రూ. 150 కోట్ల షేర్ రాబట్టిన ఘనతను అందుకున్నాడు.
ఇకపోతే.. 20 రోజుల వరకు నైజాంలో రూ.40.58 కోట్లు, సీడెడ్‌లో రూ.18.01 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.21.43 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.42 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.68 కోట్లు, గుంటూరులో రూ.10.17 కోట్లు, కృష్ణాలో రూ.9.37 కోట్లు, నెల్లూరులో రూ. 4.59 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 126.25 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.50 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.203.70 కోట్లు గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా షేర్‌తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్మురేపుతోంది.
ఇక 21వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే వర్కింగ్ డే అయిన సోమవారం కూడా సంక్రాంతికి వస్తున్నాం ఎక్స్‌లెంట్ హోల్డ్ చేసింది. మార్నింగ్, మ్యాట్నీ షోలకు ఆక్యూపెన్సీ అంతంత మాత్రంగానే ఉండగా ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ బాగా జరిగినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా సోమవారం ప్రపంచవ్యాప్తంగా రూ. 1.36 కోట్ల గ్రాస్ రాబట్టాడు వెంకటేష్. అంతేకాదు.. 21వ రోజు నాటికే రూ. 300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన వెంకటేష్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
మొత్తం రూ.303 కోట్ల వసూళ్లతో రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో సంక్రాంతికి వస్తున్నాం ఆల్‌టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచినట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ వారం నాగచైతన్య నటించిన తండేల్ సహా మరికొన్ని సినిమాలు రిలీజ్ కానుండటంతో సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి హోల్డ్ చూపిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











