Sankranthiki Vasthunam Box Office : వర్కింగ్ డేలోనూ వసూళ్ల ఊచకోత.. వెంకటేష్ మూవీకి ఎన్ని కోట్లంటే?
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఈ సినిమా ఎక్సలెంట్ హోల్డ్ చూపిస్తోంది. మూడు వారాల్లోనే ఏకంగా రూ.303 కోట్ల వసూళ్లతో విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. ఈ నేపథ్యంలో 22వ రోజు ఈ చిత్రం ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.
కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు రూ. 120 కోట్లకు పైగా లాభాలను పంచి పెట్టింది. నాన్ బాహుబలి రికార్డుల్ని ఒక్కొక్కటిగా అధిగమిస్తున్న ఈ సినిమా రీజినల్ చిత్రాల్లో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది.
ఇకపోతే.. 21 రోజుల వరకు నైజాంలో రూ.40.86 కోట్లు, సీడెడ్‌లో రూ.18.17 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.21.59 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.47 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.72 కోట్లు, గుంటూరులో రూ.10.21 కోట్లు, కృష్ణాలో రూ.9.41 కోట్లు, నెల్లూరులో రూ. 4.62 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 127.05 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.58 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.205.05 కోట్లు గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.152 కోట్లకు పైగా షేర్‌తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్మురేపుతోంది.
ఊహకందని ప్రాఫిట్స్‌తో దుమ్మురేపుతోన్న సంక్రాంతికి వస్తున్నాం చిత్రం.. నైజాం ఏరియాలో రూ.40 కోట్ల షేర్ మార్క్ దాటేసి ఏకంగా రూ. 33 కోట్ల లాభాలను అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు అందించింది. ఒక్క నైజాం ఏరియాలోనే క్వాడ్రపుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి షాకిచ్చింది. మిగిలిన ఏరియాల్లోనూ ఇదే స్థాయిలో లాభాలను అందుకుని వెంకటేష్ కెరీర్‌లోనే మెమొరబుల్ మూవీగా నిలిచింది.
ఇక 22వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. మంగళవారం వర్కింగ్ డే కావడంతో మార్నింగ్, మ్యాట్నీ షోలకు బుకింగ్ డల్‌గా సాగింది. అయితే ఫస్ట్ షో, సెకండ్ షో నుంచి మంచి ఆక్యూపెన్సీ నమోదైంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా నిన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.2 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ వారం నాగచైతన్య నటించిన తండేల్ సహా మరికొన్ని సినిమాలు రిలీజ్ కానుండటంతో సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి హోల్డ్ చూపిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











