Sankranthiki Vasthunam Box Office : బాహుబలి 2కి చేరువలో .. వసూళ్లలో వెంకీ రేర్ ఫీట్ , ఎన్ని కోట్లంటే?
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు వారాల్లోనే ఏకంగా రూ.303 కోట్ల వసూళ్లతో విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ ఫీట్ అందుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు సైతం చాలా ఏళ్ల తర్వాత లాభాలను కళ్లచూస్తుండటంతో ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 23వ రోజు సంక్రాంతికి వస్తున్నాం ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. కేవలం మూడు రోజుల్లోనే సేఫ్ జోన్‌లోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటి వరకు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు రూ. 140 కోట్లకు పైగా లాభాలను పంచి పెట్టింది.
ఇకపోతే.. 22 రోజుల వరకు నైజాంలో రూ.41.10 కోట్లు, సీడెడ్‌లో రూ.18.31 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.21.73 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.51 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.75 కోట్లు, గుంటూరులో రూ.10.23 కోట్లు, కృష్ణాలో రూ.9.44 కోట్లు, నెల్లూరులో రూ. 4.64 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 127.71 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.71 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.70 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.206.25 కోట్లు గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.153.12 కోట్లకు పైగా షేర్‌తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్మురేపుతోంది.
గతేడాది టాలీవుడ్‌లో హిట్ అయిన సినిమాలు లాంగ్ రన్‌లో మంచి ప్రాఫిట్స్‌ను అందించాయి. రోజుకు రూ. కోటికి తగ్గకుండా షేర్‌ని రాబట్టి కలెక్షన్ల పంట పండించింది. ఇప్పుడు వెంకటేష్ చిత్రం కూడా ఎక్స్‌లెంగ్ లాంగ్ రన్‌ను అందుకుంది. సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాలలో బాలకృష్ణ డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాల కలెక్షన్లు స్లో అవ్వగా సంక్రాంతికి వస్తున్నాం మాత్రం రోజుకు 20 రోజులు తగ్గకుండా కోటి రూపాయల షేర్ అందుకుంది.

బాహుబలి 2 28 రోజుల పాటు , పుష్ప 2 26 రోజుల పాటు రోజుకు కోటి రూపాయలు తగ్గకుండా షేర్ రాబట్టగా.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం వరుసగా 23 రోజుల పాటు రూ.కోటి షేర్‌ను అందుకున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వెంకటేష్ జోరు ఇలాగే కొనసాగితే ఈ రెండు చిత్రాల రికార్డులను బద్ధలు కొట్టడం పెద్ద కష్టం కాదని అంచనా వేస్తున్నారు.
ఇక 23వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. బుధవారం వర్కింగ్ డే కావడంతో మార్నింగ్, మ్యాట్నీ షోలకు బుకింగ్ డల్‌గా సాగింది. అయితే ఫస్ట్ షో, సెకండ్ షో నుంచి మంచి ఆక్యూపెన్సీ నమోదైంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా నిన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.1.13 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. గురువారం అజిత్ పట్టుదల, నాగచైతన్య నటించిన తండేల్ సహా మరికొన్ని సినిమాలు రిలీజ్ కానుండటంతో సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి హోల్డ్ చూపిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











