Sankranthiki Vasthunam Box Office : దెబ్బేసిన అజిత్ .. వెంకటేష్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం వీరి కలయికలో హ్యాట్రిక్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు ఘన విజయం అందుకోగా.. ఆ రెండు చిత్రాలను మించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా 24వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.
మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కొట్టేసిన వెంకటేష్ వీకెండ్, వర్కింగ్ డే అన్న తేడా లేకుండా కుమ్మేస్తున్నాడు. ఇప్పటికే బయ్యర్లకు రూ. 150 కోట్లకు పైగా లాభాలను పంచి పెట్టిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మరిన్ని ప్రాఫిట్స్ దిశగా దూసుకెళ్తోంది. వరుసగా 23 రోజుల పాటు రోజుకు కోటి రూపాయల షేర్ తగ్గకుండా షేర్ రాబట్టిన వెంకటేష్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు.

ఇకపోతే.. 23 రోజుల వరకు నైజాంలో రూ.41.32 కోట్లు, సీడెడ్‌లో రూ.18.42 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.21.85 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.54 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.78 కోట్లు, గుంటూరులో రూ.10.25 కోట్లు, కృష్ణాలో రూ.9.47 కోట్లు, నెల్లూరులో రూ. 4.66 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 128.29 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.76 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.207.35 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది.
23 రోజుల వరకు ఎదురులేకుండా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తొలిసారిగా గురువారం డ్రాప్స్ చూసింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన పట్టుదల విడుదలవ్వడంతో పాటు వర్కింగ్ డే కావడంతో బుకింగ్స్ పడిపోయాయి. 24వ రోజున వెంకటేష్ చిత్రం రూ. 82 లక్షల గ్రాస్ మాత్రమే రాబట్టి .. తొలిసారిగా కోటి లోపు కలెక్షన్స్ అందుకుంది. అజిత్ నటించిన పట్టుదలకు తోడు, శుక్రవారం నాగచైతన్య - సాయిపల్లవిల తండేల్ రిలీజ్ కానుండటంతో సంక్రాంతికి వస్తున్నాంకు టఫ్ ఫైట్ ఎదురుకానుంది. మరి ఈ పోటీలో వెంకటేష్ ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











