Sankranthiki Vasthunam Box Office : దెబ్బేసిన తండేల్.. వెంకటేష్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు భారీ విజయాన్ని అందించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆరంభించింది. కేవలం మూడు వారాల్లోనే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో నాన్ బాహుబలి రికార్డులను . ఇప్పటి వరకు పోటీ లేకుండా దూసుకెళ్లిన వెంకటేష్ చిత్రానికి ఈ వారం రెండు పెద్ద సినిమాలు సవాల్ విసురుతున్నాయి. మరిసంక్రాంతికి వస్తున్నాం సినిమా 25వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 25

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరి మార్కెట్ వర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటి వరకు రూ. 150 కోట్లకు పైగా లాభాలను పంచి పెట్టి స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజుకు , ఆయన బ్యానర్‌కు ఉపశమనం కలిగించింది.

ఇకపోతే.. 24 రోజుల వరకు నైజాంలో రూ.41.50 కోట్లు, సీడెడ్‌లో రూ.18.51 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.21.95 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.56 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.81 కోట్లు, గుంటూరులో రూ.10.27 కోట్లు, కృష్ణాలో రూ.9.49 కోట్లు, నెల్లూరులో రూ. 4.67 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 128.76 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.79 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.80 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.208.25 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.154.35 కోట్ల షేర్‌ను రాబట్టింది.

దాదాపు 24 రోజుల వరకు రోజుకు రూ. కోటి తగ్గకుండా షేర్ రాబట్టిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం గత రెండ్రోజులుగా డల్ అయ్యింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన పట్టుదల ఫిబ్రవరి 6న , ఇక ఫిబ్రవరి 7వ తేదీ అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవిల తండేల్ విడుదల అయ్యాయి. ఈ సినిమాల ప్రభావం వెంకటేష్ సినిమాపై పడినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా తండేల్‌కు క్లాస్, మాస్ సెంటర్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సంక్రాంతికి వస్తున్నాంకు బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి.

శుక్రవారం ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ జోరందుకోవడంతో వెంకటేష్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఎంత పోటీ ఉన్నప్పటికీ ఈ వీకెండ్‌లో సంక్రాంతికి వస్తున్నాం మంచి హోల్డ్ సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి వెంకటేష్ ఎలాంటి మేజిక్ చేస్తాడో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X