Sankranthiki Vasthunam Day 28 Collection: పడిపోయిన బుకింగ్స్..వెంకీ మూవీకి షాకింగ్ కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి పలు నాన్ బాహుబలి రికార్డులను బద్ధలుకొట్టింది. పెద్ద సినిమాల రాకతో వెంకటేష్ కాస్త స్లో అయినట్లు కనిపించినా గత వీకెండబ్‌లో కుమ్మేశాడు . మరి వర్కింగ్‌ డే అయిన 28వ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 28

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. అయితే ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను కొట్టేశాడు వెంకటేష్. ఇప్పటి వరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా రూ. 150 కోట్లకు పైగా లాభాలను అందుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇకపోతే.. 27 రోజుల వరకు నైజాంలో రూ.42.18 కోట్లు, సీడెడ్‌లో రూ.18.86 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22.31 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.68 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.92 కోట్లు, గుంటూరులో రూ.10.35 కోట్లు, కృష్ణాలో రూ.9.58 కోట్లు, నెల్లూరులో రూ. 4.75 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 130.63 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.91 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.211.65 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.156.44 కోట్ల షేర్‌ను రాబట్టింది.

సంక్రాంతి నుంచి నిన్న మొన్నటి వరకు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన వెంకీ మామకు గత వారం మాత్రం పోటీ ఎదురైంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన పట్టుదల ఫిబ్రవరి 6న , ఇక ఫిబ్రవరి 7వ తేదీ అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవిల తండేల్ విడుదల అయ్యాయి. తండేల్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం మూవీకి గట్టి పోటీ ఎదురవుతున్నట్లుగా విశ్లేషకులు అంటున్నారు.

ఆ రెండు రోజులు కోటి లోపు షేర్ మాత్రమే అందుకున్న వెంకటేష్.. వీకెండ్‌లో మాత్రం జూలు విదిల్చాడు. శనివారం రూ.1.36 కోట్లు, ఆదివారం రూ.1.83 కోట్ల గ్రాస్ అందుకున్నాడు. వర్కింగ్‌ డే అయిన సోమవారం సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి రూ. 53 లక్షల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి అతి తక్కువ కలెక్షన్స్ రావడం ఇదే . మరి వారం వెంకటేష్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X