Sankranthiki Vasthunam Day 29 Collection : వెంకటేష్‌కు దెబ్బ మీద దెబ్బ.. పడిపోతున్న వసూళ్లు, ఎన్ని కోట్లంటే?

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నాలుగు వారాలు పూర్తి చేసుకుని విజయవంతంగా ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కొత్త సినిమాలు వస్తున్నా.. పోటీని తట్టుకుని మరి తన పరుగు కొనసాగిస్తున్నాడు వెంకటేష్. మరి 29వ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 29

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. అయితే ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చింది ఈ చిత్రం. ఇప్పటి వరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా రూ. 150 కోట్లకు పైగా లాభాలను అందుకుని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు పండగ తెచ్చింది.

ఇకపోతే.. 28 రోజుల వరకు నైజాంలో రూ.42.28 కోట్లు, సీడెడ్‌లో రూ.18.91 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22.35 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.69 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.94 కోట్లు, గుంటూరులో రూ.10.36 కోట్లు, కృష్ణాలో రూ.9.59 కోట్లు, నెల్లూరులో రూ. 4.76 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 130.88 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.92 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.92 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.212.10 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.156.72 కోట్ల షేర్‌ను రాబట్టింది.

దాదాపు 24 రోజుల వరకు రోజుకు రూ. కోటి తగ్గకుండా రికార్డులను తిరగరాసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు గత వారం నుంచి కాస్త డల్ అయ్యింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన పట్టుదల ఫిబ్రవరి 6న , ఇక ఫిబ్రవరి 7వ తేదీ అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవిల తండేల్ విడుదల అయ్యాయి. ఆ రెండు రోజులు వెంకటేష్ చిత్రానికి వసూళ్లు కోటి లోపలే వచ్చాయి. అయితే వీకెండ్‌లో మాత్రం ఏకంగా రూ.3 కోట్లకు పైగా గ్రాస్ అందుకుని తిరిగి పుంజుకుంది. కానీ సోమవారం నుంచి పరిస్ధితి దారుణంగా తయారైంది. కేవలం రూ. 53 లక్షల గ్రాస్ మాత్రమే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రాబట్టింది. తాజాగా 29వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. మంగళవారం కూడా ఈ సినిమా కేవలం రూ.52 లక్షలు మాత్రమే వసూలు చేసింది. మరి ఐదోవారం వెంకటేష్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X