Sankranthiki Vasthunam Box Office : 3 రోజుల్లో 100 కోట్లు ఔట్ .. మూడో రోజు ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపిస్తున్నాడు. తాను వేటకు వస్తే పరిస్ధితి ఎలా ఉంటుందో? తన రేంజ్ ఏంటో నిరూపిస్తున్నాడు. సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నామంటూ వచ్చిన వెంకీ మామ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పిస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నాడు. మరి మూడో రోజు వెంకటేష్ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
వెంకటేష్ , యువ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ.45 కోట్లను, రెండో రోజును రూ. 22 కోట్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. వెంకటేష్ జోరు చూస్తే తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను కొట్టేసి కొత్త సంవత్సరంలో క్లీన్ హిట్‌గా నిలిచింది.

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.
ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారుగా 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
తొలుత అంతంత మాత్రంగా ఉన్న దశలో గోదారి గట్టు మీద రామ చిలక సాంగ్ బయటికొచ్చాక సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో హైప్ మరింత పెరిగింది. సంక్రాంతికి టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ దాదాపు 1300 స్క్రీన్లలో సంక్రాంతికి వస్తున్నాం మూవీని రిలీజ్ చేశారు. అంచనాలకు తగినట్లుగానే తొలిరోజు ఏకంగా రూ.45 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక తొలిరోజు వసూళ్లుగా నిలిచింది. స్వల్పంగా కలెక్షన్స్ తగ్గినప్పటికీ రెండో రోజు ఏకంగా రూ.32 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

సంక్రాంతి ఫీవర్ ఈ వీకెండ్ వరకు ఉంటుంది. అలాగే చాలా గ్రామాల్లో బంధు మిత్రుల సందడి అలాగే ఉండగా, పిల్లలకు ఆదివారం వరకు సెలవులు కావడంతో వెంకటేష్ మూవీకి హౌస్‌ఫుల్ బోర్డ్స్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 29 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మూడు రోజుల వరకు ఈ సినిమా రూ. 106 కోట్ల గ్రాస్ వసూళ్లతో వెంకటేష్ కెరీర్‌లోనే మెమొరబుల్ హిట్‌గా నిలిచింది. వీకెండ్ నాటికి వెంకీ మామ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











