Sankranthiki Vasthunam Day 30 Collection : మాస్ కలెక్షన్స్‌తో మెంటలెక్కిస్తోన్న వెంకటేష్.. ఎన్ని కోట్లంటే?
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఐదో వారంలో కాస్త స్లో అవుతోంది. వీకెండ్‌లో కుమ్మేస్తోన్న ఈ సినిమా .. వర్కింగ్ డేస్‌లో మాత్రం పడుతూ లేస్తూ సాగుతోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో ప్రాంతీయ చిత్రాల్లో సరికొత్త రికార్డులు సృష్టించాడు వెంకటేష్. సీనియర్ హీరోలలో ఎవరికీ లేని కలెక్షన్స్ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. మరి 30వ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. మూడు రోజుల్లోనే లక్ష్యాన్ని కొట్టిపడేసిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు దాదాపు రూ. 150 కోట్లకు పైగా లాభాలను డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు పంచిపెట్టింది.
ఇకపోతే.. 29 రోజుల వరకు నైజాంలో రూ.42.36 కోట్లు, సీడెడ్‌లో రూ.18.95 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22.38 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.70 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.95 కోట్లు, గుంటూరులో రూ.10.37 కోట్లు, కృష్ణాలో రూ.9.60 కోట్లు, నెల్లూరులో రూ. 4.77 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 131.08 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.94 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.95 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.212.50 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.156.97 కోట్ల షేర్‌ను రాబట్టింది.

నాన్ బాహుబలి రికార్డులతో పాటు రంగస్థలం, అల వైకుంఠపురం, సైరా నర్సింహారెడ్డి వంటి సినిమాలను క్రాస్ చేసేసింది సంక్రాంతికి వస్తున్నాం. అలాగే 24 రోజుల వరకు రోజుకు రూ.కోటికి పైగా షేర్ రాబట్టిన ఈ సినిమా .. బాహుబలి 2, పుష్ప 2 వంటి సినిమాల లిస్ట్‌లో చేరింది. నాలుగు వారాల పాటు తన హవా చూపిన వెంకటేష్‌కు ఐదో వారం నుంచి పోటీ ఎదురైంది అజిత్ పట్టుదల, నాగచైతన్య తండేల్ సినిమాలు సవాల్ విసిరాయి. అయినప్పటికీ వీకెండ్‌లో దుమ్ముదులిపాడు వెంకీ మామ.
శని, ఆదివారాల్లో రూ. 3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం.. వర్కింగ్ డేస్‌లో మాత్రం తగ్గింది. రోజుకు రూ. 60 లక్షల లోపే కలెక్షన్స్ సాధిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో 30 రోజు వసూళ్ల విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా బుధవారం ఈ సినిమా బాగానే హోల్డ్ చేసింది. సోమ, మంగళవారాలతో పోలిస్తే మంచి వసూళ్లను రాబట్టింది. 30వ రోజు రూ. 70 లక్షల గ్రాస్ రాబట్టి టఫ్ ఫైట్‌లోనూ కుమ్మిపడేసింది. మరి ఐదో వారం ముగిసేసరికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎలాంటి మేజిక్ చూస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











