Sankranthiki Vasthunam Day 31 Collection : పడిపోయిన బుకింగ్స్.. వెంకీ మూవీకి షాకిచ్చే కలెక్షన్స్, ఎన్ని కోట్లం
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతంగా 30 రోజులు పూర్తి చేసుకుని వడివడిగా అర్ధ శత దినోత్సవం దిశగా సాగుతోంది. తండేల్, పట్టుదల తదితర సినిమాలతో కాస్త స్లో అయినట్లుగా కనిపించినప్పటికీ వెంకీ మామ మళ్లీ జూలు విదిల్చాడు. ఈ నేపథ్యంలో 31వ రోజు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎన్ని కోట్లు వసూళ్ల రాబట్టిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. ఇప్పటి వరకు దాదాపు రూ. 150 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది.
ఇకపోతే.. 30 రోజుల వరకు ఈ సినిమా నైజాంలో రూ.42.42 కోట్లు, సీడెడ్‌లో రూ.18.98 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22.40 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.71 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.96 కోట్లు, గుంటూరులో రూ.10.38 కోట్లు, కృష్ణాలో రూ.9.61 కోట్లు, నెల్లూరులో రూ. 4.79 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 131.25 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.96 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.96 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.212.80 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.157.17 కోట్ల షేర్‌ను రాబట్టింది.

గత వారం నాగచైతన్య నటించిన తండేల్, అజిత్ నటించిన పట్టుదల చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఫిబ్రవరి 14 నుంచి మరో రెండు చిత్రాలు పోటీ ఇవ్వనున్నాయి. దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం నటించిన బ్రహ్మ ఆనందంతో పాటు మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటించిన లైలా చిత్రాలు ఈరోజే రిలీజ్ కానున్నాయి. ఇంతటి టఫ్ ఫైట్‌లో వెంకటేష్ ఎలా నిలబడతాడని ట్రేడ్ పండితులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
గత శని, ఆదివారాల్లో రూ. 3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించడంతో ఈ వీకెండ్ పైనా సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 31వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా గురువారం ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. తొలిసారిగా రూ.50 లక్షల లోపే కలెక్షన్స్‌కే పరిమితమైన వెంకటేష్ 31వ రోజు రూ. 49 లక్షల గ్రాస్ మాత్రమే అందుకున్నాడు. మరి ఐదో వారం ముగిసేసరికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎలాంటి మేజిక్ చూస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











