Sankranthiki Vasthunam Day 33 Collection : మారని కథ .. వెంకటేష్ మూవీకి దారుణంగా వసూళ్లు, ఎన్ని కోట్లంటే?

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ - సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. వీరిద్దరి కలయికలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. టాలీవుడ్‌‌లోని నలుగురు అగ్ర కథా నాయకుల్లో ఎవరికీ లేని విధంగా రేర్ రికార్డును సొంతం చేసుకున్నారు వెంకటేష్. అలాగే రీజనల్ చిత్రాల్లో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. 5 వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా 33వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే:

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 33

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ లక్ష్యాన్ని పూర్తి చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. ఇప్పటి వరకు దాదాపు రూ. 150 కోట్లకు పైగా లాభాలను డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతకు పంచి పెట్టింది .

ఇకపోతే.. 31 రోజుల వరకు ఈ సినిమా నైజాంలో రూ.42.47 కోట్లు, సీడెడ్‌లో రూ.19.01 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22.42 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.72 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.97 కోట్లు, గుంటూరులో రూ.10.39 కోట్లు, కృష్ణాలో రూ.9.62 కోట్లు, నెల్లూరులో రూ. 4.80 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 131.40 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.97 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.97 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.213.10 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.157.34 కోట్ల షేర్‌ను రాబట్టింది.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 33

గత వారం నాగచైతన్య నటించిన తండేల్, అజిత్ నటించిన పట్టుదల చిత్రాలతో పాటు ఫిబ్రవరి 14నబ్రహ్మానందం నటించిన బ్రహ్మ ఆనందం, విశ్వక్‌సేన్ నటించిన లైలా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలన్నీ సంక్రాంతికి వస్తున్నాంపై ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా తండేల్ ఎఫెక్ట్ గట్టిగానే పడినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో 33వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. ఈ వారం ప్రారంభం నుంచి సంక్రాంతికి వస్తున్నాంకు వసూళ్లు భారీగా పడిపోతూ వస్తున్నాయి. దీంతో వీకెండ్‌పై చిత్ర యూనిట్‌ భారీ అంశాలు పెట్టుకుంది. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ శనివారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 52 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించి ఊరట కలిగించింది. ఈ క్రమంలో ఆదివారం సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X