Sankranthiki Vasthunam Day 34 Collection: టగ్ ఆఫ్ వార్‌లో వెంకీ ఊచకోత..వీకెండ్‌లో వసూళ్ల జాతర, ఎన్ని కోట్లంటే

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఎఫ్ 2, ఎఫ్ 3ల హిట్ తర్వాత వీరి కలయికలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్ధలుకొట్టింది. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో రీజనల్ చిత్రాల్లో ఈ ఘనత సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. మార్కెట్‌లో పలు సినిమాలు ఉండగా ..ఈ టఫ్ ఫైట్‌లో 34వ రోజు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 34

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. మూడు రోజుల్లోనే ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. ఇప్పటి వరకు దాదాపు రూ. 150 కోట్లకు పైగా లాభాలను డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతకు పంచి పెట్టింది .

33 రోజుల వరకు ఈ సినిమా నైజాంలో రూ.42.60 కోట్లు, సీడెడ్‌లో రూ.19.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22.47 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.75 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.98 కోట్లు, గుంటూరులో రూ.10.39 కోట్లు, కృష్ణాలో రూ.9.63 కోట్లు, నెల్లూరులో రూ. 4.82 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 131.70 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.98 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.98 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.213.70 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.157.66 కోట్ల షేర్‌ను రాబట్టింది.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 34

దాదాపు 24 రోజుల వరకు పోటీ లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విక్టరీ వెంకటేష్‌కు నాగచైతన్య నటించిన తండేల్, అజిత్ నటించిన పట్టుదల, బ్రహ్మానందం నటించిన బ్రహ్మా ఆనందం , విశ్వక్‌సేన్ నటించిన లైలా సినిమాలు గట్టి పోటీ ఇచ్చాయి. వర్కింగ్ డేస్‌లో చాలా వరకు బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి. అయితే ఈ పోటీని తట్టుకుంటూ వీకెండ్‌లో కుమ్మేశాడు వెంకటేష్ . శనివారం ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు రూ.52 లక్షల గ్రాస్ వసూళ్లు రాగా.. ఆదివారం ఏకంగా రూ. 76 లక్షల గ్రాస్ రాబట్టింది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ స్టార్ట్ కానుండటంతో వెంకటేష్ చిత్రం ఏ మేరకు నిలబడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X