Sankranthiki Vasthunam Day 35 Collection : పనిచేయని వెంకటేష్ మేజిక్.. షాకిచ్చేలా కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఆరో వారాన్ని కూడా పూర్తి చేసుకోనుంది. కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ వెంకటేష్ తన మార్క్ మాయాజాలంతో సినిమాను నడిపిస్తున్నాడు. వర్కింగ్ డేస్‌ల్ డల్‌గా ఉన్నప్పటికీ.. వీకెండ్స్‌లో మాత్రం చితక్కొడుతోంది సంక్రాంతికి వస్తున్నాం చిత్రం. ఈ నేపథ్యంలో 35వ రోజు వెంకటేష్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 35

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. మూడు రోజుల్లోనే సేఫ్ జోన్‌లోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లను నిలబెట్టింది. ఇప్పటి వరకు దాదాపు రూ. 150 కోట్లకు పైగా లాభాలను పంచి ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత పండగ తీసుకొచ్చింది.

34 రోజుల వరకు ఈ సినిమా నైజాంలో రూ.42.71 కోట్లు, సీడెడ్‌లో రూ.19.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22.51 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.77 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.99 కోట్లు, గుంటూరులో రూ.10.40 కోట్లు, కృష్ణాలో రూ.9.65 కోట్లు, నెల్లూరులో రూ. 4.84 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 131.97 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.9 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 17 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.214.25 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.157.97 కోట్ల షేర్‌ను రాబట్టింది.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 35

తండేల్, పట్టుదల, బ్రహ్మా ఆనందం , లైలాతో పాటు విక్కీ కౌశల్ నటించిన చావా వంటి హిస్టారిక్ చిత్రాల నుంచి టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ వీకెండ్‌లో విక్టరీ వెంకటేష్ దుమ్మురేపాడు. శనివారం రూ. 52 లక్షలు, ఆదివారం రూ. 76 లక్షలు రాబట్టింది సంక్రాంతికి వస్తున్నాం చిత్రం. సోమవారం వసూళ్ల విషయానికి వస్తే సినిమా రిలీజైన నాటి నుంచి నేటి వరకు ఎన్నడూ లేని విధంగా పాతిక లక్షల లోపే వసూళ్లు వచ్చాయి. 35వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి వెంకటేష్ చిత్రానికి. మరి ఈ వారం సంక్రాంతి వస్తున్నాం ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X