Sankranthiki Vasthunam Day 36 Collection : ఎండ్ కార్డ్ దిశగా వెంకీ మూవీ.. దారుణంగా కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతంగా ఐదో వారాన్ని కంప్లీట్ చేసుకుంది. కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ.. చావా వంటి హిస్టారిక్ మూవీ దుమ్మురేపుతున్నప్పటికీ వెంకటేష్ తన భుజాలపై సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని నడిపిస్తున్నాడు. సోమవారం నుంచి శుక్రవారం వరకు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ.. వీకెండ్స్‌లో మాత్రం చితక్కొడుతోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో 36వ రోజు వెంకటేష్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. మూడు రోజుల్లోనే లాభాల పంట పండించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు దాదాపు రూ. 150 కోట్లకు పైగా లాభాలను పంచి తిరుగులేని రికార్డులతో దూసుకెళ్తున్నాడు విక్టరీ వెంకటేష్.
35 రోజుల వరకు (5 వారాలు) ఈ సినిమా నైజాంలో రూ.42.74 కోట్లు, సీడెడ్‌లో రూ.19.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.77 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9 కోట్లు, గుంటూరులో రూ.10.40 కోట్లు, కృష్ణాలో రూ.9.66 కోట్లు, నెల్లూరులో రూ. 4.85 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 132.07 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.9 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 17 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.214.45 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.158.07 కోట్ల షేర్‌ను రాబట్టింది.

గత వీకెండ్‌లో రూ. 1.50 కోట్ల గ్రాస్ రాబట్టి జూలు విదిల్చిన విక్టరీ వెంకటేష్ సినిమాకు సోమవారం నుంచి బ్యాడ్‌టైం స్టార్ట్ అయ్యింది. రిలీజైన నాటి నుంచి ఏనాడు లేని విధంగా వసూళ్లు పాతిక లక్షల లోపు పడిపోయాయి. 36వ రోజు కూడా సంక్రాంతికి వస్తున్నాంకు ప్రపంచవ్యాప్తంగా రూ. 20 లక్షల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి . ఇంతటి టఫ్ ఫైట్‌లో మరి ఈ వారం సంక్రాంతి వస్తున్నాం ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











