Sankranthiki Vasthunam Day 37 Collection : మెగాస్టార్ రికార్డ్ ఔట్ .. వెంకటేష్ వసూళ్ల జాతర , ఎన్ని కోట్లంటే?

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతంగా ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. తండేల్ వంటి ప్రేమకథలతో పాటు విక్కీ కౌశల్ నటించిన చావా లాంటి హిస్టారిక్ చిత్రాలు వెండితెరను షేక్ చేస్తున్నా విక్టరీ వెంకటేష్ తట్టుకుని నిలబడుతున్నాడు. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 37వ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 37

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని నిర్దేశించారు ట్రేడ్ పండితులు. పండగ సీజన్‌లో మూడు రోజుల్లోనే లాభాల పంట పండించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లను నిలబెట్టింది. ఇప్పటి వరకు దాదాపు రూ. 150 కోట్లకు పైగా లాభాలను అందించి, ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు వెంకటేష్.

35 రోజుల వరకు (5 వారాలు) ఈ సినిమా నైజాంలో రూ.42.74 కోట్లు, సీడెడ్‌లో రూ.19.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.77 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9 కోట్లు, గుంటూరులో రూ.10.40 కోట్లు, కృష్ణాలో రూ.9.66 కోట్లు, నెల్లూరులో రూ. 4.85 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 132.07 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.9 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 17 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.214.45 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.158.07 కోట్ల షేర్‌ను రాబట్టింది.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 37

టాలీవుడ్ సీనియర్ హీరోలలో రూ.300 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్న హీరోగా వెంకటేష్ నిలిచారు. అలాగే రంగస్థలం, సైరా నర్సింహారెడ్డి, అల వైకుంఠపురంలో వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల రికార్డులను బద్ధలుకొట్టింది సంక్రాంతికి వస్తున్నాం. తాజాగా సీడెడ్ ఏరియాలో వెంకీ మామ రేర్ ఫీట్ అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా ఈ ఏరియాలో టోటల్ రన్‌లో రూ. 19.11 షేర్ అందుకుంది. అయితే వెంకీ కేవలం 5 వారాల్లోనే రూ.19.15 కోట్ల షేర్ రాబట్టి చిరు రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తంగా రాయలసీమ ప్రాంతంలో ఆల్‌టైం షేర్ విషయంలో సంక్రాంతికి వస్తున్నాం 8వ స్థానంలో నిలిచింది.

ఇక 37వ రోజు వసూళ్ల విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాం దారుణంగా ఫెయిలైంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 15 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. తండేల్, చావా వంటి సినిమాలు దుమ్మురేపుతుండటంతో రానున్న రోజుల్లో వెంకటేష్ చిత్రం ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X