Sankranthiki Vasthunam Day 38 Collection : ఇక లాగడం కష్టమే.. దారుణంగా వసూళ్లు, వెంకటేష్ మూవీకి ఎన్ని కోట్లంటే?

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఆరో వారంలో పడుతూ లేస్తూ సాగుతోంది. 24 రోజుల వరకు రోజుకు రూ. కోటి తప్పకుండా షేర్ రాబట్టిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. కానీ గత రెండ్రోజులుగా అత్యంత దారుణంగా రూ.20 లక్షల లోపే వసూళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 38వ రోజు వెంకటేష్ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 38

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని నిర్దేశించారు ట్రేడ్ పండితులు. మూడు రోజుల్లోనే సేఫ్ జోన్‌లోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. ఇప్పటి వరకు దాదాపు రూ. 150 కోట్లకు పైగా లాభాలను పంచిపెట్టింది. ఈ ప్రయాణంలో ఎన్నో రికార్డులను బద్ధలుకొట్టాడు వెంకటేష్.

35 రోజుల వరకు (5 వారాలు) ఈ సినిమా నైజాంలో రూ.42.74 కోట్లు, సీడెడ్‌లో రూ.19.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.77 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9 కోట్లు, గుంటూరులో రూ.10.40 కోట్లు, కృష్ణాలో రూ.9.66 కోట్లు, నెల్లూరులో రూ. 4.85 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 132.07 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.9 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 17 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.214.45 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.158.07 కోట్ల షేర్‌ను రాబట్టింది.

చావా , తండేల్ వంటి సినిమాలు ఉన్నప్పటికీ వీకెండ్‌లో శని , ఆదివారాలు కలిపి రూ. 1.30 కోట్లుకు పైగా రాబట్టిన వెంకటేష్ విజయవంతంగా ఐదు వారాలు పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాతి నుంచే అసలు కథ మొదలైంది. రోజుకు కనీసం రూ.20 లక్షలు కూడా రాబట్టలేక అపసోపాలు పడుతోంది సంక్రాంతికి వస్తున్నాం. నిన్న మరీ దారుణంగా రూ.15 లక్షల గ్రాస్ మాత్రమే అందుకుంది. అయితే 38వ రోజు కూడా ఈ సినిమా కథ ఏమాత్రం మారలేదు. గురువారం వెంకీ అభిమానులను నిరాశకు గురిచేస్తూ రూ. 11 లక్షల వసూళ్లు మాత్రమే రాబట్టింది. శుక్రవారం సాయంత్రం నుంచి తిరిగి ఆదివారం వరకు వసూళ్లు బాగుంటాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. చూద్దాం మరి వెంకటేష్ ఏ మేరకు సత్తా చాటుతాడో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X