Sankranthiki Vasthunam Day 39 Collection: చావా ఊచకోత..వెంకటేష్ చిత్రానికి కలెక్షన్స్ నిల్, ఇంత దారుణమా?
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ ప్రయాణం ఆల్‌మోస్ట్ ఎండింగ్ స్టేజ్‌కి వచ్చింది. ఐదు వారాల పాటు ఎదురు లేకుండా సాగిన వెంకటేష్ చిత్రం .. ఆరో వారం నుంచి పూర్తిగా చేతులేత్తేసింది . రోజుకు రూ. 25 లక్షలు కూడా రావడం లేదు . ఈ నేపథ్యంలో 39వ రోజు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎన్ని కోట్లు వసూళ్లు రాబట్టిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని నిర్దేశించారు ట్రేడ్ పండితులు. మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. ఇప్పటి వరకు దాదాపు రూ. 150 కోట్లకు పైగా లాభాలను పంచిపెట్టింది. ఈ ప్రయాణంలో ఎన్నో రికార్డులను బద్ధలుకొట్టాడు వెంకటేష్. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో రీజనల్ చిత్రాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
35 రోజుల వరకు (5 వారాలు) ఈ సినిమా నైజాంలో రూ.42.74 కోట్లు, సీడెడ్‌లో రూ.19.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.77 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9 కోట్లు, గుంటూరులో రూ.10.40 కోట్లు, కృష్ణాలో రూ.9.66 కోట్లు, నెల్లూరులో రూ. 4.85 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 132.07 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.9 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 17 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.214.45 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.158.07 కోట్ల షేర్‌ను రాబట్టింది.
చావా , తండేల్ వంటి సినిమాల నుంచి వెంకటేష్ చిత్రానికి గట్టి పోటీ ఎదురవుతోంది. రోజు రోజుకు కలెక్షన్స్ దారుణంగా పడిపోతున్నాయి. గురువారం వెంకటేష్ అభిమానులను నిరాశకు గురిచేస్తూ కేవలం రూ. 11 లక్షల వసూళ్లు మాత్రమే రాబట్టింది సంక్రాంతికి వస్తున్నాం. ఇక 39వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. శుక్రవారం రూ.10 లక్షలు మాత్రమే అందుకుంది ఈ సినిమా. వీకెండ్ మొదలు కావడంతో శని, ఆదివారాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మేకర్స్. ఇప్పటి వరకు వారాంతాల్లో వెంకటేష్ చిత్రం డిజప్పాయింట్ చేయలేదు. మరి వెంకటేష్ ఈ రెండు రోజుల్లో ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











