Sankranthiki Vasthunam Box Office : వెంకటేష్ మాస్ కుమ్ముడు .. నాలుగో రోజు ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, యువ దర్శకుడు అనిల్ రావిపూడిలు తమ కాంబినేషన్‌కు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన ఈ జోడి తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అంటూ వినోదాన్ని పంచారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కు క్యూకడుతూ ఉండటంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో 4వ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందంటే?
సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాంకు బెనిఫిట్ షో నుంచే హిట్ టాక్ వచ్చింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచే దిశగా పరుగులు తీస్తోంది.

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.
ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది.

టీజర్, ట్రైలర్, పాటలతో పాటు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని టఫ్ ఫైట్‌లోనూ ఏకంగా 1300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. వెంకటేష్ నటన, కామెడీ, అనిల్ రావిపూడి టేకింగ్ అన్నింటికీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో తొలిరోజు ఏకంగా రూ.45 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది.
తర్వాత రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.29 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి కేవలం 3 రోజుల్లోనే రూ.106 కోట్లు కలెక్ట్ చేసింది. అంతేకాదు రూ.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అలవోకగా కొట్టేసి లాభాలను అందిస్తోంది. సంక్రాంతి సెలవులు, వీకెండ్ కావడంతో సంక్రాంతికి వస్తున్నాంకు అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులు పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇకపోతే .. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాంకు రూ. 16 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో విక్టరీ వెంకటేష్ ఎలాంటి మేజిక్ చేస్తాడో?


Click it and Unblock the Notifications











