Sankranthiki Vasthunam Day 40 Collection :హ్యాండ్ ఇచ్చిన వీకెండ్.. దారుణంగా కలెక్షన్స్, వెంకీ మూవీ ఎన్ని కోట్ల

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం 40 రోజుల మార్క్ చేరుకుంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసినట్లేనని వస్తున్న గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఐదు రోజులుగా పడుతూ లేస్తూ సాగుతున్న ఈ చిత్ర ప్రయాణం శనివారం ఎలా జరిగింది? వీకెండ్‌లోనైనా వెంకటేష్ చిత్రానికి చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయో లేదో ఒకసారి పరిశీలిస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 40

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని నిర్దేశించారు ట్రేడ్ పండితులు. కేవలం విడుదలైన మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. ఇప్పటి వరకు దాదాపు రూ. 150 కోట్లకు పైగా లాభాలను పంచిపెట్టింది. దాదాపు రూ.300 కోట్లకు గ్రాస్ పైగా వసూళ్లతో రీజనల్ చిత్రాల్లో కొత్త లెక్కలు సెట్ చేసింది.

35 రోజుల వరకు (5 వారాలు) ఈ సినిమా నైజాంలో రూ.42.74 కోట్లు, సీడెడ్‌లో రూ.19.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.77 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9 కోట్లు, గుంటూరులో రూ.10.40 కోట్లు, కృష్ణాలో రూ.9.66 కోట్లు, నెల్లూరులో రూ. 4.85 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 132.07 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.9 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 17 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.214.45 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.158.07 కోట్ల షేర్‌ను రాబట్టింది.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 40

దాదాపు 25 రోజుల వరకు తనకు అడ్డొచ్చిన ప్రతి సినిమాను తొక్కుకుంటూ వెళ్లిన వెంకటేష్‌కు ఆ తర్వాతి నుంచి కష్టాలు మొదలయ్యాయి. వీకెండ్‌లో తప్పించి వర్కింగ్ డేస్‌లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఆదరించేవారు తగ్గుతూ వచ్చారు. ఇంతలో చావా , తండేల్ వంటి సినిమాలు రావడంతో గట్టి దెబ్బ తగిలినట్లయ్యింది. ఈ వారం పరిస్ధితులు మరింత దారుణంగా దిగజారాయి. వెంకటేష్ అభిమానులను నిరాశకు గురిచేస్తూ కేవలం రూ. 10 లక్షల లోపే వసూళ్లు రాబట్టింది సంక్రాంతికి వస్తున్నాం.

ఇక 40వ రోజు శనివారం అయినప్పటికీ పరిస్ధితులు ఏమాత్రం మారలేదు.. కేవలం రూ.7 లక్షలు మాత్రమే అందుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఆదివారంతో వెంకటేష్ సినిమాకు ఎండ్ కార్డ్ పడినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X