Sankranthiki Vasthunam Day 11 Collection : వెంకటేష్ వసూళ్ల బీభత్సం .. 11వ రోజు ఎన్ని కోట్లంటే?

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అందుకు తగినట్లుగానే భారీ వసూళ్లు రాబట్టి.. వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఫస్ట్ వీక్‌లోనే ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంక్రాంతి ఫైట్‌లో విజేతగా నిలిచింది. మరి రెండో వారంలో సంక్రాంతికి వస్తున్నాం పరిస్ధితి ఎలా ఉంది? 11వ రోజు వెంకటేష్ చిత్రం ఎన్ని కోట్లు సాధించిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Prediction Day 11

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. తొలి మూడు రోజుల్లోనే అలవోకగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఛేదించిన వెంకటేష్ డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందిస్తున్నాడు.

కేవలం 10 రోజుల్లోనే రూ.120 కోట్లకు పైగా షేర్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. దాదాపు 78.38 కోట్ల లాభాలను అందించి డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ 10 రోజుల వ్యవధిలో నైజాంలో రూ.31.18 కోట్లు, సీడెడ్‌లో రూ.14.57 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.15.81 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.11.32 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.05 కోట్లు, గుంటూరులో రూ.8.92 కోట్లు, కృష్ణాలో రూ.8.07 కోట్లు, నెల్లూరులో రూ. 3.76 కోట్లు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.7 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14 కోట్లతో మొత్తంగా 120.88 కోట్ల షేర్ .. రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Prediction Day 11

ఇకపోతే 11వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే శుక్రవారం వర్కింగ్ డే కావడంతో ఉదయం, మ్యాట్నీ ఆటలకు బుకింగ్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. అయితే ఫస్ట్ షో, సెకండ్ షో నుంచి బుకింగ్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు రూ. 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X