Sankranthiki Vasthunam Day 12 Collection : వీకెండ్‌లో వసూళ్ల జోరు.. వెంకటేష్ మూవీకి ఎన్ని కోట్లంటే?

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం రెండో వారాన్ని కూడా విజయవంతంగా ముగించే దిశగా అడుగులు వేస్తోంది. ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యపరిచేలా తొలి వారంలోనే ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన వెంకటేష్ చిత్రం ... సెకండ్ వీక్‌లోనూ సాలీడ్ బుకింగ్స్‌తో దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలో 12వ రోజు సంక్రాంతికి వస్తున్నాం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Prediction Day 12

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బరిలో దిగిన వెంకటేష్ చిత్రం మూడు రోజుల్లోనే లక్ష్యాన్ని అందుకుని లాభాల బాట పట్టింది.

11 రోజుల వరకు నైజాంలో రూ.31.92 కోట్లు, సీడెడ్‌లో రూ.14.89 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.16.57 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.11.57 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.24 కోట్లు, గుంటూరులో రూ.9.07 కోట్లు, కృష్ణాలో రూ.8.21 కోట్లు, నెల్లూరులో రూ. 3.84 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 103.31 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.7 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.15 కోట్లతో కలిపి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 124.11 కోట్ల షేర్ .. రూ.240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే ఆల్ టైం బాక్సాఫీస్ రికార్డు నెలకొల్పింది.

ఈ క్రమంలో సీడెడ్ ఏరియాలో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు వెంకీ మామ. కేవలం 11 రోజుల్లోనే జీఎస్టీతో కలిపి రూ.17.2 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించాడు. ఇక 12వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే శనివారం వీకెండ్ కావడంతో బుకింగ్స్‌లో గ్రోత్ కనిపిస్తోంది. మొత్తంగా 12వ రోజు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు రూ. 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ బాగుండటం, థియేటర్‌లో మరో సినిమా లేకపోవడంతో సెకండ్ వీకెండ్ నాటికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాలీడ్ వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X