Sankranthiki Vasthunam Day 15 Collection : వర్కింగ్ డేలోనూ బాదుడే.. వెంకటేష్ మూవీకి ఎన్ని కోట్లంటే?

టాలీవుడ్ అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం దుమ్మురేపుతోంది. రెండు వారాలు పూర్తి చేసుకున్నప్పటికీ ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు వెంకటేష్ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు 15వ రోజు ఎన్ని కోట్ల వసూళ్లు వచ్చాయో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Prediction Day 15

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. కేవలం మూడు రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని ఊదిపారేసింది సంక్రాంతికి వస్తున్నాం . ఇప్పటికే బయ్యర్లకు రూ.100 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టిన ఈ సినిమా లాంగ్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తుందోనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇకపోతే.. 14 రోజుల వరకు నైజాంలో రూ.37.64 కోట్లు, సీడెడ్‌లో రూ.16.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.19.61 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.12.66 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.15 కోట్లు, గుంటూరులో రూ.9.80 కోట్లు, కృష్ణాలో రూ.8.93 కోట్లు, నెల్లూరులో రూ. 4.27 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 117.52 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.7.88 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 15.30 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.189.35 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.241.85 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే ఆల్ టైం బాక్సాఫీస్ రికార్డు నెలకొల్పింది.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Prediction Day 15

టాలీవుడ్‌లోని నలుగురు అగ్ర కథానాయకుల సినిమాలలో తెలుగు వెర్షన్‌కు గాను రూ.240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో చిరంజీవి రికార్డును బద్ధలు కొట్టాడు వెంకటేష్. వడి వడిగా రూ.300 కోట్ల వైపు దూసుకెళ్తున్నాడు వెంకీ మామ. ఇక 15వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే వర్కింగ్ డే కావడంతో బుకింగ్స్ ఎప్పటిలాగే పడిపోయాయి. అయితే ఫస్ట్ షో, సెకండ్ షోల నుంచి బుకింగ్స్ బాగుంటాయని అంటున్నారు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ మంగళవారం రూ. 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి వెంకటేష్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X