Sankranthiki Vasthunam Day 16 Collection : తగ్గని వెంకటేష్ దూకుడు .. 16వ రోజు ఎన్ని కోట్లంటే?

విక్టరీ వెంకటేష్, ఓటమి ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం రూ.300 కోట్ల టార్గెట్ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. బయ్యర్లకు లాభాల పంట పండిస్తోన్న సంక్రాంతికి వస్తున్నాం .. 16వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందో చూస్తే:

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Prediction Day 16

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. మార్కెట్ వర్గాలనే విస్మయపరిచేలా ఈ లక్ష్యాన్ని కేవలం 3 రోజుల్లోనే కొట్టేసింది సంక్రాంతికి వస్తున్నాం . బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు రూ.100 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టిన ఈ సినిమా లాంగ్ రన్‌లో ఎంత ప్రాఫిట్‌ను అందిస్తోందోనని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

ఇకపోతే.. 15 రోజుల వరకు నైజాంలో రూ.38.12 కోట్లు, సీడెడ్‌లో రూ.16.71 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.19.94 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.12.80 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.25 కోట్లు, గుంటూరులో రూ.9.88 కోట్లు, కృష్ణాలో రూ.9.02 కోట్లు, నెల్లూరులో రూ. 4.32 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 119.04 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.7.94 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 15.55 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.191.70 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.248 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే ఆల్ టైం బాక్సాఫీస్ రికార్డు నెలకొల్పింది.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Prediction Day 16

సెకండ్ వీక్‌లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 28 కోట్ల రేంజ్‌లో షేర్ రాబట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా .. హనుమాన్, కల్కి, దేవర, పుష్ప 2 రేంజ్‌లో హోల్డ్ చూపిస్తోంది. ఇక 16వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే వర్కింగ్ డే కావడంతో ఆక్యూపెన్సీ డల్‌గా ఉంది. అయితే ఫస్ట్ షో, సెకండ్ షోల నుంచి బుకింగ్స్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ బుధవారం రూ. 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతోందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X