Sankranthiki Vasthunam Day 19 Collection : వెంకటేష్ చిత్రానికి కలెక్షన్ల వర్షం.. ఎన్ని కోట్లంటే?
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మూడో వారం ముగింపుకు చేరుకుంది. ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఎవరికీ లేని రికార్డును తన పేరిట లిఖించుకున్నారు వెంకీ. వీకెండ్ కావడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ వసూళ్లను అందిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 19వ రోజు వెంకటేష్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.
మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఊదేసిన వెంకటేష్ తన జైత్రయాత్రను నేటికీ కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే బయ్యర్లకు రూ. 100 కోట్లకు పైగా లాభాలను పంచి పెట్టిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం.. వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న దిల్‌రాజును, ఆయన సంస్థను ఒడ్డున పడేసింది. లాంగ్ రన్‌లో ఈ సినిమా ఎంత ప్రాఫిట్ అందిస్తుందోనని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.
ఇకపోతే.. 18 రోజుల వరకు నైజాంలో రూ.39.26 కోట్లు, సీడెడ్‌లో రూ.17.33 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.20.63 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.10 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.44 కోట్లు, గుంటూరులో రూ.10 కోట్లు, కృష్ణాలో రూ.9.17 కోట్లు, నెల్లూరులో రూ. 4.42 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 122.35 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.18 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 15.95 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.197.25 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.252 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది.

ఇక 19వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే శనివారం నుంచి వీకెండ్ ప్రారంభం కానుండటం, మరో పెద్ద సినిమా లేకపోవడంతో కుటుంబ ప్రేక్షకులు సంక్రాంతికి వస్తున్నాం థియేటర్లకు పోటెత్తుతారని భావిస్తున్నారు. వచ్చే వారం నాగచైతన్య - సాయిపల్లవి నటించిన తండేల్ విడుదలయ్యే వరకు వెంకటేష్ సినిమాకు ఇప్పట్లో ఎదురులేదని విశ్లేషకులు భావిస్తున్నారు. శనివారం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 4 కోట్ల గ్రాస్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద వెంకటేష్ చిత్రం ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











