Sankranthiki Vasthunam Day 24 Collection : వెంకటేష్ చిత్రంపై అజిత్ మూవీ ఎఫెక్ట్? .. 24వ రోజు ఎన్ని కోట్లంటే?

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ - సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఎవరికీ లేని రికార్డును తన పేరిట లిఖించుకున్నారు వెంకటేష్. వీకెండ్ , వర్కింగ్ డే అన్న తేడా లేకుండా కుమ్మేస్తోన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా 24వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Prediction Day 24

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.

మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఊదేసిన వెంకటేష్ తన జైత్రయాత్రను నేటికీ కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే బయ్యర్లకు రూ. 150 కోట్లకు పైగా లాభాలను పంచి పెట్టిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం డిస్ట్రిబ్యూటర్లను ఒడ్డునపడేసింది. ఇక వరుసగా 23 రోజుల పాటు రోజుకు కోటి రూపాయల షేర్ తగ్గకుండా షేర్ రాబట్టిన వెంకటేష్.. బాహుబలి 2, పుష్ప 2 సినిమాల రికార్డుకు చేరువలో ఉన్నాడు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Prediction Day 24

ఇకపోతే.. 23 రోజుల వరకు నైజాంలో రూ.41.32 కోట్లు, సీడెడ్‌లో రూ.18.42 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.21.85 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.54 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.78 కోట్లు, గుంటూరులో రూ.10.25 కోట్లు, కృష్ణాలో రూ.9.47 కోట్లు, నెల్లూరులో రూ. 4.66 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 128.29 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.76 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.207.35 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది.

24వ రోజు వర్కింగ్ డే కావడంతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన పట్టుదల విడుదల కావడంతో సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ స్లో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద గురువారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమ రూ.82 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X