Sankranthiki Vasthunam Day 25 Collection : బాక్సాఫీస్ వద్ద మామ అల్లుళ్ల సవాల్.. వెంకీ మూవీకి ఎన్ని కోట్లంటే?

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబో మరోసారి మాకు తిరుగులేదని నిరూపించింది. వీరిద్దరి కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ మూడు వారాల్లోనే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో రీజనల్ చిత్రాల్లో సరికొత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. వీకెండ్ , వర్కింగ్ డే అన్న తేడా లేకుండా కుమ్మేస్తోన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా 25వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Prediction Day 25

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటి వరకు రూ. 150 కోట్లకు పైగా లాభాలను పంచి పెట్టింది.

ఇకపోతే.. 24 రోజుల వరకు నైజాంలో రూ.41.50 కోట్లు, సీడెడ్‌లో రూ.18.51 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.21.95 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.56 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.81 కోట్లు, గుంటూరులో రూ.10.27 కోట్లు, కృష్ణాలో రూ.9.49 కోట్లు, నెల్లూరులో రూ. 4.67 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 128.76 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.79 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.80 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.208.25 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.154.35 కోట్ల షేర్‌ను రాబట్టింది.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Prediction Day 25

ఇప్పటి వరకు ఎదురులేకుండా సాగిన విక్టరీ వెంకటేష్‌కు నాలుగో వారంలో పోటీ ఎదురైంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన పట్టుదల ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక ఫిబ్రవరి 7వ తేదీ అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవిల తండేల్ విడుదలైంది. అజిత్ సినిమా ఏమో కానీ తండేల్ ప్రభావం సంక్రాంతికి వస్తున్నాంపై పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

25వ రోజు వర్కింగ్ డే కావడంతో మార్నింగ్, మ్యాట్నీ షోలకు బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి. అయితే సాయంత్రం నుంచి ఆక్యూపెన్సీ పెరుగుతుందని అనుకున్నా క్లాస్ , మాస్ సెంటర్స్‌లో తండేల్ నుంచి పోటీ ఎదురవుతున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తం మీద శనివారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.71 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X