Sankranthiki Vasthunam Day 4 Collection : 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి.. 4వ రోజు ఎంతంటే?

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. బెనిఫిట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది. వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం .. నాలుగో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Prediction Day 4

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు లెక్క కట్టారు.

టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నింటి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 1300 స్క్రీన్లలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాని రిలీజ్ చేశారు. వెంకటేష్ నటన, అనిల్ రావిపూడి టేకింగ్ అన్ని కలవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. తొలిరోజు ఏకంగా రూ.45 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Prediction Day 4

రెండో రోజూ కూడా సంక్రాంతికి వస్తున్నాం అదే జోరు కొనసాగించింది.. స్వల్పంగా కలెక్షన్స్ తగ్గినప్పటికీ ఏకంగా రూ.32 కోట్లు, మూడో రోజు రూ.29 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అలా మొత్తంగా కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా రూ.106 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి.. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అలవోకగా కొట్టిపారేసింది. దాంతో ఇకపై ఈ సినిమా వచ్చే డబ్బంతా లాభాలేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పండుగ నిమిత్తం స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరిగి నగరాలకు చేరుకుంటుండటంతో తెలుగు నాట ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. శుక్రవారం నుంచి వీకెండ్ కూడా ప్రారంభం కానుండటంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాంకు రూ. 11 కోట్ల గ్రాస్ వసూళ్లు లభిస్తాయని భావిస్తున్నారు. మరి చూద్దాం ఇంతటి టఫ్ ఫైట్‌లో విక్టరీ వెంకటేష్ ఎలాంటి మేజిక్ చేస్తాడో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X