Sankranthiki Vasthunam Day 7 Collection : 200 కోట్లు ఔట్.. వసూళ్లలో వెంకటేష్ సరికొత్త రికార్డ్..!

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించిన ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌‌లో అడుగుపెట్టింది. వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం .. ఏడో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Prediction Day 7

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

వెంకటేష్ నటన, అనిల్ రావిపూడి టేకింగ్ అన్ని కలవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. తొలిరోజు ఏకంగా రూ.45 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ క్రాస్ చేయడంతో పాటు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అలవోకగా ఛేదించింది సంక్రాంతికి వస్తున్నాం. దీంతో చిత్ర నిర్మాణ సంస్థతో పాటు డిస్ట్రిబ్యూటర్లు అంతా ఖుషి అవుతున్నారు. థియేటర్లు కూడా చాలా రోజుల తర్వాత కళకళలాడుతుండటంతో క్యాంటీన్, పార్కింగ్ ఆదాయాలు బాగున్నాయి.

ఇప్పటి వరకు సంక్రాంతి సెలవులు, వీకెండ్ కావడంతో దుమ్మరేపిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సోమవారం నుంచి ఎలాంటి ప్రదర్శన చేస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. పండుగ నిమిత్తం స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరిగి నగరాలకు చేరుకుంటుండటంతో తెలుగు నాట ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్‌లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. దీంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Prediction Day 7

ఇక ఏడో రోజు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాంకు రూ. 8 కోట్ల గ్రాస్ వసూళ్లు లభిస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సోమవారంతో ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండో వారంలోనూ అదే జోరు చూపిస్తుందా? ఫైనల్‌గా వెంకీ మామ ఎక్కడ తన పరుగు పందెం ఆపుతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X