Sankranthiki Vasthunam Day 8 Collection : వర్కింగ్ డేలోనూ వసూళ్ల జాతర .. 8వ రోజు ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన ఈ సినిమా మరో రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు 8వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే.
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ టార్గెట్‌ను కేవలం మూడు రోజుల్లో ఛేదించి దుమ్ము రేపింది ఈ చిత్రం.
తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రూ. 160 కోట్ల గ్రాస్ వసూళ్లతో .. రూ. 80 కోట్లకు పైగా లాభాలను బయ్యర్లకు అందించాడు వెంకటేష్. ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ అమెరికాలోనూ సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్మురేపుతోంది. తొలి వారంలో నార్త్ అమెరికాలో 2.3 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్‌రాజు కాంబినేషన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇదే. గతంలో ఈ కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌తో పాటు 1 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.

తొలి వారంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. నైజాంలో రూ. 27.51 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.79 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.73 కోట్లు, ఈస్ట్‌లో రూ.9.72 కోట్లు, వెస్ట్‌లో రూ. 6.45 కోట్లు, కృష్ణాలో రూ. 7.18 కోట్లు, గుంటూరులో రూ.7.90 కోట్లు, నెల్లూరులో రూ. 3.28 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లు చొప్పున రాబట్టింది. ఇకపోతే.. 8వ రోజు ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. వర్కింగ్ డే కావడంతో దాదాపు 60 శాతం మేర బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి. మంగళవారం సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు రూ. 5 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications











