Sankranthiki Vasthunam Day 9 Collection : తగ్గని వెంకటేష్ జోరు .. 9వ రోజు ఎన్ని కోట్లంటే?
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు ఘన విజయం సాధించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని కైవసం చేసుకుంది. తొలి వారంలోనే ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంక్రాంతి ఫైట్‌లో విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో 9వ రోజు వెంకటేష్ చిత్రం ఎన్ని కోట్లు సాధించిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఛేదించడంతో పాటు ఇప్పటికే దాదాపు రూ. 90 కోట్లకు లాభాలను డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు పంచాడు వెంకటేష్. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న దిల్‌రాజు కంపెనీని ఈ సినిమా ఒడ్డున పడేసింది.
తొలి వారంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా .. రూ.203 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 160.4 కోట్లు, కర్ణాటకలో రూ. 8.4 కోట్లు, తమిళనాడులో రూ. 1.4 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.2.8 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.26 కోట్లు చొప్పున కలెక్షన్స్ రాబట్టింది.

విజయవంతంగా రెండో వారంలోకి ప్రవేశించిన ఈ చిత్రం వర్కింగ్ డేస్‌లోనూ అదే జోరు కనిపిస్తోంది. ఇకపోతే.. 9 రోజు ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. వర్కింగ్ డే కావడంతో దాదాపు 60 శాతం మేర బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి. బుధవారం వెంకటేష్ సినిమాకు రూ. 4 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications











