Sankranthiki Vasthunam Day 2 Collection : వెంకీ విధ్వంసం ఇలా ఉంటదా... రెండో రోజు ఎన్ని కోట్లంటే?

కామెడీ సినిమాల స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ సినిమాల హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధికంగా దాదాపు రూ. 45 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది ఈ సినిమా. ఈ నేపథ్యంలో రెండో రోజు సంక్రాంతికి వస్తున్నాం ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు మొత్తంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారుగా 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు తెలిపారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Day 2 collection report

గోదారి గట్టు మీద రామ చిలక సహా బీమ్స్ అందించిన ఇతర పాటలు, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 1300 స్క్రీన్లలో సంక్రాంతికి వస్తున్నాం మూవీని రిలీజ్ చేశారు. అంచనాలకు తగినట్లుగానే తొలిరోజు ఏకంగా రూ.45 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక తొలిరోజు వసూళ్లుగా నిలిచింది.

పండగపూట ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావాల్సిన విందు భోజనం లాంటి ఎలిమెంట్స్‌తో రూపొందించిన ఈ సినిమాకు ఆ కేటగిరీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం కోసం ఉదయం 4 గంటలకు వేసిన బెనిఫిట్ షోకు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఆదివారం వరకు ఈ సినిమాకు అదే స్పందన లభిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ఖుషీ అవుతోంది.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Day 2 collection report

ఇక సంక్రాంతికి వస్తున్నాం రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. కనుమ నాడు వసూళ్లు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం వరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 22 కోట్ల గ్రాస్ దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్లు, ఇతర రాష్ట్రాలు + ఓవర్సీస్‌లో రూ. 10 కోట్ల చొప్పున కలెక్షన్స్ రాబట్టినట్లు చెబుతున్నారు. మొత్తంగా రెండు రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా 77 కోట్ల గ్రాస్ రాబట్టి విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దూసుకెళ్తోంది. మరి వీకెండ్ నాటికి వెంకీ మామ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X