sankranthiki vasthunnam Collection : అక్కడ రికార్డ్ కలెక్షన్స్ కొట్టిన వెంకటేష్ .. ఎన్ని కోట్లంటే?

ఓటీటీలో రానా నాయుడుతో విమర్శలకు తోడు గతేడాది వచ్చిన సైంధవ్‌తో తన పని అయిపోయిందని అనుకున్న వారికి మైండ్ బ్లాకయ్యే రేంజ్‌లో షాకిచ్చారు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం .. సంక్రాంతి కానుకగా విడుదలై వసూళ్ల బెండు తీస్తోంది. డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ వంటి భారీ చిత్రాలు ఉన్నప్పటికీ వాటిని పక్కకునెట్టి సంక్రాంతి హిట్‌గా నిలవడంతో పాటు ఈ ఏడాది తొలి బ్లాక్‌బస్టర్‌ను టాలీవుడ్‌కు అందించారు వెంకీ.

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

victory Venkatesh s sankranthiki vasthunnam creates new box office record in ceded region in just 11 days

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం మూడు రోజుల్లోనే అలవోకగా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను క్రాస్ చేసిన ఈ సినిమా లాభాల పంట పండిస్తోంది.

కేవలం 10 రోజుల్లోనే రూ.120 కోట్లకు పైగా షేర్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. దాదాపు 78.38 కోట్ల లాభాలను అందించి డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో షేర్ పరంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం రికార్డును బద్ధలు కొట్టేశాడు వెంకటేష్. నేడో రేపో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి షేర్ (105 కోట్లు)ను బద్ధలుకొట్టే దిశగా పరుగులు తీస్తోంది సంక్రాంతికి వస్తున్నాం మూవీ.

victory Venkatesh s sankranthiki vasthunnam creates new box office record in ceded region in just 11 days

11 రోజుల వరకు రూ. 240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. తద్వారా టాలీవుడ్‌లోని నలుగురు అగ్ర కథానాయకుల్లో చిరంజీవి (సైరా నర్సింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య) తర్వాత రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన హీరోగా నిలిచారు వెంకటేష్. టీజర్, ట్రైలర్, పాటలతో పాటు కామెడీ ఉండటంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. విడుదలై 11 రోజులు కావొస్తున్నా రోజుకు రూ. 5 కోట్లు తగ్గకుండా వసూళ్లు రాబడుతున్నారు వెంకటేష్.

తాజాగా సీడెడ్ ఏరియాలో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు వెంకీ మామ. కేవలం 11 రోజుల్లోనే జీఎస్టీతో కలిపి రూ.17.2 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ బాగుండటం, థియేటర్‌లో మరో సినిమా లేకపోవడంతో సెకండ్ వీకెండ్ నాటికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాలీడ్ వసూళ్లు రాబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X