Vidaamuyarchi Collections: విదా ముయార్చి అడ్వాన్స్ బుకింగ్ సంచలనం.. రిలీజ్‌కు ముందే అజిత్ మూవీ రికార్డులు

తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ జంటగా నటించిన తాజా చిత్రం విదా ముయార్చి. దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత సుభాస్కరన్ అలిరాజా నిర్మించారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? కలెక్షన్లు ఎంత? అడ్వాన్స్ బుకింగ్‌కు వస్తున్న స్పందన ఏమిటనే వివరాల్లోకి వెళితే..

బడ్జెట్ ఎంతంటే?
మగీజ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కసండ్రా, ఆరవ్, రమ్య సుబ్రమణ్యం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హాలీవుడ్ రైటర్ జోనాథన్ మోస్టో బ్రేక్ డౌన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు ఈ చిత్రాన్ని సుమారుగా 350 కోట్ల రూపాయలతో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ సినిమాకు ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫి, ఎన్‌బీ శ్రీకాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

Vidaamuyarchi Advance Booking Collections Worldwide Ajith Kumar Creating records at GBOC

అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్
అమెరికాలో విదా ముయార్చి సినిమాకు మంచి రెస్సాన్స్ లభిస్తున్నది. ఇటీవల ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగా కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. అమెరికాలో 190 లొకేషన్లలో 457 షోలు కోసం స్ుమారుగా 7 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు ఈ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సుమారుగా 150000 డాలర్లు అంటే 13 లక్షల రూపాయలు రాబట్టింది.

యూఏఈలో ఓపెనింగ్స్
ఇక యూఏఈలో ఈ చిత్రానికి భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. ఇప్పటి వరకు 372 షోలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేయగా, సుమారుగా 6000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు 60K డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా 7 లక్షల రూపాయలు వసూలు అయ్యాయి. ఇంకా రిలీజ్‌కు సమయం ఉన్నందున భారీగా వసూళ్లు నమోదు అవుతాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మలేషియాలో బాక్సాఫీస్ రిపోర్టు
విదాముయార్చి మూవీకి మలేషియాలో అనూహ్యమైన రెస్పాన్ప్ లభిస్తున్నది. ఈ సినిమా కోసం సుమారుగా 600 షోలు ప్రదర్శించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు 15000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో సుమారుగా 5 లక్షల రూపాయలు వసూలైనట్టు తెలుస్తున్నది.

తమిళనాడులో రికార్డుల వర్షం
తమిళనాడులో అజిత్ మూవీకి సంచలన రీతిలో కలెక్షన్లను నమోదు అవుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 1000 కిపైగా స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ చిత్రం సుమారుగా 3 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.

బెంగళూరులో సంచలనం రీతిలో
కర్ణాటకలో విదా ముయార్చి చిత్రానికి బ్రహ్మండమైన రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించి 900 షోలు ప్రదర్శించేందుకు బెంగళూరులో ప్లాన్ చేశారు. రిలీజ్ రోజు వరకు 1000 కిపైగా షోలకు చేరుకొంటుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X