Vidaamuyarchi Closing Collection : షాకిచ్చేలా విదాముయార్చి వసూళ్లు.. అజిత్ మూవీకి లాభమెంత? నష్టమెంత?
కొత్త సంవత్సరం మదగజరాజాతో గ్రాండ్‌గా ఓపెన్ చేసింది తమిళ చిత్ర పరిశ్రమ.. తాజాగా బాక్సాఫీస్‌పై దండెత్తడానికి వచ్చాడు తలా అజిత్ కుమార్. రెండేళ్ల క్రితం తునివు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన నుంచి ఏడాదిన్నరగా ఎలాంటి సినిమా రాకపోవడంతో అభిమానులు మంచి ఆకలితో ఉన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 6వ తేదీన అజిత్ నటించిన విడాముయార్చి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? లాభమెంత? నష్టమెంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టిందో లేదా అనే వివరాల్లోకి వెళితే..
తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుననారు. ఇందులో అజిత్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా అర్జున్ , రెజినా, రమ్య సుబ్రహ్మణ్యం, నిఖిల్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో పట్టుదల పేరుతో విడుదల చేశారు.

విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న విదాముయార్చి సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. తమిళనాడులో రూ.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.20 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు, కర్ణాటక + కేరళ + రెస్టాఫ్ ఇండియాలో రూ.6 కోట్లు చొప్పున మొత్తంగా రూ.95 కోట్ల చొప్పున వ్యాపారం జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.185 కోట్ల గ్రాస్.. రూ. 97 కోట్ల షేర్ రావాల్సి ఉంది.
విదాముయార్చి చిత్రం తమిళనాడు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళంలో తొలి రోజు 26 కోట్ల రూపాయలు, రెండో రోజు 10 కోట్ల రూపాయలు, మూడో రోజు 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక తెలుగులో పెద్దగా ఈ సినిమాకు స్పందన కనిపించలేదు. దాంతో పేలవంగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. తెలుగులో 1వ రోజు 75 లక్షలు, రెండో రోజు 50 లక్షలు, మూడో రోజు 50 లక్షలు, నాలుగో రోజు 40 లక్షలు వసూలు చేసింది. కన్నడలో ఈ సినిమాకు మంచి రెస్సాన్స్ కనిపించింది. మొదటి రోజు 4.25 కోట్లు, రెండో రోజు 1 కోటి రూపాయలు, 3వ రోజు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
మొత్తంగా 15 రోజుల్లో విదాముయార్చి సాధించిన కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి వారం రూ.75 కోట్ల నెట్ కలెక్షన్స్, రెండో వారంలో రూ.9 కోట్ల నెట్ కలెక్షన్స్‌ని రాబట్టింది. మొత్తంగా 15 రోజుల వరకు తమిళనాడులో రూ.80 కోట్లు, కర్ణాటకలో రూ.10 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 3 కోట్లు, కేరళలో రూ.4 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.2 కోట్లు చొప్పున ఇండియా వైడ్‌గా రూ. 100 కోట్ల గ్రాస్ అందుకోగా.. ఓవర్సీస్‌లో వచ్చిన రూ. 40 కోట్లు కలిపి మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
రూ.185 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన అజిత్ చిత్రం కేవలం 60 శాతం మాత్రమే రికవరీ సాధించి డిస్ట్రిబ్యూటర్లు , బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఒకటి రెండు ఏరియాలు తప్పించి అన్ని చోట్ల విదాముయార్చి నష్టాలను మిగిల్చింది. మరోవైపు.. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ రూ.75 కోట్లకు పైగా వెచ్చించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఓటీటీ నిబంధనలను అనుసరించి ఫిబ్రవరి 28న కానీ, మార్చి తొలి వారంలో కానీ విదాముయార్చి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్‌లో సక్సెస్ కాలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఏమాత్రం సక్సెస్ కొడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











