Vidaamuyarchi Box Office: విదాముయార్చికి రికార్డు కలెక్షన్లు.. అజిత్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

తమిళ సూపర్ స్టార్ అజిత్, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ విదాముయార్చి చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. దక్షిణాదిలో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై పారెపులర్ నిర్మాత సుభాస్కరన్ అలిరాజా నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కంసాడ్రా తదితరులు నటించారు. మెగిజ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసే కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

విదాముయార్చి సినిమాను తెలుగులో పట్టుదల టైటిల్‌తో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ తెలుగు రాష్ట్రాల్లో శూన్యం. దాంతో ఈ సినిమా రిలీజ్ అవుతుందనే విషయం కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. దాంతో ఈ సినిమాకు ఆంధ్రా, నైజాంలో పెద్దగా బజ్ క్రియేట్ కాలేదనే మాట ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపించింది.

Vidaamuyarchi day 1 Expected Box Office Collections Worldwide Ajith Movie decent start at GBOC

అయితే ఈ సినిమాకు ఓవర్సీస్‌లో రికార్డు ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఇటీవల ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన రెస్సాన్స్ లభించింది.ఈ సినిమా ప్రీమియర్ల తర్వాత రికార్డు ఓపెనింగ్స్ అజిత్ కెరీర్‌లో నమోదు అయ్యాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ దేశాల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది.

విదాముమార్చి సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికా, కెనడాలో కలిపి 500K, ఆస్ట్రేలియాలో 75k ఆస్ట్రేలియా డాలర్లు,న్యూజిలాండ్‌లో 20 న్యూజిలాండ్ డాలర్లు,గల్ఫ్‌లో 200 డాలర్లు,మలేషియాలో 750 మలేషియన్ డాలర్లు, సింగపూర్‌లో 125 డాలర్లు, శ్రీలంకలో 1 కోటి రూపాయలు, యూకే,యూరప్‌లో 150 పౌండ్లు వసూలు చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా 1 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Vidaamuyarchi day 1 Expected Box Office Collections Worldwide Ajith Movie decent start at GBOC

తమిళనాడులో ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు నమోదు అయ్యాయి. కన్నడలో సినిమాకు భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. కేరళలో ఓ మోస్తారు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 17 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 21 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇదిలా ఉండగా, విదాముయార్చి సినిమా అజిత్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా రికార్డు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా సుమారుగా తొలి రోజు 55 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల కలెక్షన్లురాబడుతుందని అంచనా వేశారు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తే.. ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X