Vidaamuyarchi Collections: విజయ్, రజనీ రికార్డును టచ్ చేయని అజిత్.. విదాముయార్చికి ఎన్ని కోట్ల కలక్షన్లంటే?

తమిళ సూపర్ స్టార్ అజిత్, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ నటించిన తాజా చిత్రం విడాముయార్చి. తెలుగులో పట్టుదల అనే టైటిల్‌తో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సౌత్‌లో స్టార్ ప్రొడ్యూసర్ సుభాస్కరన్ నిర్మించారు. ఫ్యామిలీ, రొమాంటిక్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు మెగిజ్ తిరుమోనీ దర్వకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

రోడ్ జర్నీ, ట్రావెలాగ్‌ మోడ్‌లో రూపొందిన విదాముయార్చి సినిమా కథ డిమాండ్ చేయడంతో పూర్తిగా విదేశాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాను అజర్ బైజాన్ దేశంలో ఎక్కువ భాగం చిత్రీకరించారు. అర్జున్ సర్జా, రెజీనా కసండ్రా లాంటి టాప్ యాక్టర్లు, అనిరుధ్ మ్యూజిక్ ఇలా టాప్ టెక్నిషియన్స్ పనిచేయడంతో భారీ బడ్జెట్ సినిమాగాSSS మారింది. ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ చిత్రాన్ని 190 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Vidaamuyarchi Day 2 Expected Box Office Collections Worldwide Ajith Movie impressive show at GBOC

విదాముయార్చి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తమిళనాడులో థియేట్రికల్ రైట్స్‌ను సుమారుగా 70 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక తెలుగు, ఇతర రాష్ట్రాల హక్కులు మొత్తంగా 10 కోట్ల రూపాయలు మేర బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయలకు అమ్ముడుయ్యాయయి. దాంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

అజిత్, త్రిషా, తిరుమోని కాంబినేషన్‌కు క్రేజ్ భారీగా ఉండటంతో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 1000 కిపైగా థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీకి తొలి రోజు భారీగా ఆక్యుపెన్సీ నమోదైంది. ముఖ్యంగా ఈ సినిమాకు తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్ మార్కెట్‌లో పాజిటివ్ అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది.

Vidaamuyarchi Day 2 Expected Box Office Collections Worldwide Ajith Movie impressive show at GBOC

ఇదిలా ఉండగా, తొలి రోజు ఈ సినిమా తమిళనాడులో రికార్డు వసూళ్లు రాబట్టింది. తమిళనాడులో 29 కోట్ల రూపాయలు వసూలు చేయగా, తెలుగులో 50 లక్షల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. కన్నడ, ఇతర రాష్ట్రాల్లో కలిపి 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక ఓవర్సీస్‌లో 16 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 52 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ఇక రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 45 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఫస్ట్, సెకండ్ షోలకు ఈ ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 2వ రోజు 7 నుంచి 10 కోట్ల మధ్య కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. అయితే అజిత్ సినిమా ఇటీవల వచ్చిన విజయ్ ది గోట్ తొలి రోజు కలెక్షన్లు 104 కోట్ల గ్రాస్, వెట్టియాన్ 69 కోట్ల రూపాయల వసూళ్లను అధిగమించలేకపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X