Viduthalai Part1 collections వెట్రిమారన్ మూవీకి భారీ లాభాలు.. విజయ్ సేతుపతి సినిమాకు 4 రోజుల్లో ఎన్ని కోట్లంటే

రియల్టిక్ స్టోరి టెల్లర్ వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన విదుతలై పార్ట్ 1 చిత్రం సగటు ప్రేక్షకుడి నుంచే కాకుండా సినీ విమర్శకుల నుంచి భారీ ప్రశంసలు అందుకొంటున్నది. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఒక లక్ష్యంతో ఉద్యమించే విప్లవకారులతో పోలీసులకు జరిగే ఎన్‌కౌంటర్ల నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ఆకట్టుకొంటున్న విజయ్ సేతుపతి, సూరి నటించిన ఈ చిత్రం గత 4 రోజుల్లో ఏ మేరకు వసూళ్లను రాబట్టిందనే వివరాల్లోకి వెళితే ..

విడుదలై పార్ట్ 1 బడ్జెట్, స్క్రీన్ కౌంట్

విడుదలై పార్ట్ 1 బడ్జెట్, స్క్రీన్ కౌంట్

విడుదలై పార్ట్ 1 చిత్రానికి సంబంధించిన బడ్జెట్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం సుమారు 20 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు భారీ క్రేజ్ పెంచడంతో ఈ సినిమాను రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని తమిళనాడులో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

విడుదలై ప్రీ రిలీజ్ బిజినెస్

విడుదలై ప్రీ రిలీజ్ బిజినెస్

విడుదలై పార్ట్ 1 సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగింది. విజయ్ సేతుపతి, సూర్య, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి నటీనటుల సినిమా కావడంతో బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమా హక్కులు సుమారు 12 కోట్ల మేర జరిగాయి. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం 12.5 షేర్, 25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఏర్పడింది.

4 రోజుల కలెక్షన్ల వివరాలు

4 రోజుల కలెక్షన్ల వివరాలు

విడుదలై పార్ట్ 1 చిత్రానికి సంబంధించిన చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 3.85 కోట్ల షేర్, 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే..3.8 కోట్ల షేర్, 8 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. ఇక మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే 5.05 కోట్ల షేర్, 9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక నాలుగో రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే.. 2 కోట్ల షేర్, నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఎంతంటే?


విడుదలై పార్ట్ 1 సినిమా గత నాలుగు రోజుల ఓవరాల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో సుమారు 15 కోట్ల షేర్ నమోదు చేయగా, 20 కోట్ల మేరకు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 25 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని కొనసాగిస్తున్నది.

విడుదలై సినిమాకు ఎన్ని కోట్ల లాభమంటే?

విడుదలై సినిమాకు ఎన్ని కోట్ల లాభమంటే?

విడుదలై చిత్రం బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా 12.5 కోట్ల లక్ష్యంతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటంతో తొలి వారాంతంలోనే ఈ సినిమా లాభాల్లోకి చేరుకొన్నది. ఇటీవల కాలంలో తమిళనాడులో ఇలాంటి విజయాన్ని అందుకొన్న దాఖలాలు చాలా తక్కువే. రానున్న రోజుల్లో ఈ చిత్రం ఏ మేరకు లాభాలను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X