Bichagadu 2 Collection: అమాంతం పెరిగిన బిచ్చగాడు 2 కలెక్షన్స్.. హిట్ కావాలంటే మాత్రం!

డిఫరెంట్ జోనర్స్ లో మూవీస్ చేస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. అందుకే ఆయన తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే విజయ్ ఆంటోనీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం బిచ్చగాడు.

దానికి సీక్వెల్ తెరకెక్కిన లేటెస్ట్ మూవీనే బిచ్చగాడు 2 తమిళంలో (పిచైక్కారన్ 2). ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 10వ రోజు కలెక్షన్స్ వివరాలు చూస్తే..

Vijay Antony Bichagadu 2 Movie 10 Days Worldwide Box Office Collection

హీరోనే మ్యూజిక్ డైరెక్టర్: తమిళ హీరో విజయ్ ఆంటోనీ మొదటిసారిగా మెగా ఫోన్ పట్టిన మూవీ బిచ్చగాడు 2. ముద్దుగుమ్మ కావ్య థాపర్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు విజయ్ ఆంటోనీనే మ్యూజిక్ అందించడం మరో ఆసక్తిర అంశం. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సీక్వెల్ మూవీకి కలెక్షన్స్ బగానే వస్తున్నాయి.

Vijay Antony Bichagadu 2 Movie 10 Days Worldwide Box Office Collection

ప్రీ రిలీజ్ బిజినెస్: డబ్బింగ్ మూవీస్ ద్వారా విజయ్ ఆంటోనికి ఏపీ తెలంగాణలోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. ఆయన మార్కెట్ కు తగినట్లుగానే బిచ్చగాడు 2 ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. ఏపీ తెలంగాణలో రూ. 6 కోట్లు మేర బిజినెస్‌ చేసింది బిచ్చగాడు 2. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు వరకూ బిజినెస్ అయిందని సమాచారం. దీంతో బ్రేక్ ఈవెన్ రూ. 16 కోట్లుగా ఫిక్స్ అయింది.

Vijay Antony Bichagadu 2 Movie 10 Days Worldwide Box Office Collection

10వ రోజు వసూళ్లు: బిచ్చగాడు 2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు తగ్గుతూ వస్తున్న గత రెండు రోజులుగా పెరుగతున్నాయి. తాజాగా 10వ రోజు అంటే ఆదివారం రోజున భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్‌, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 40 లక్షలు కలెక్ట్ చేసింది.

Vijay Antony Bichagadu 2 Movie 10 Days Worldwide Box Office Collection

10 రోజుల్లో వచ్చింది: సీక్వెల్ మూవీ బిచ్చగాడు 2కి 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన స్పందన బాగుంది. ఫలితంగా నైజాంలో రూ. 2.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.25 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 68 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 49 లక్షలు, గుంటూరులో రూ. 68 లక్షలు, కృష్ణాలో రూ. 68 లక్షలు, నెల్లూరులో రూ. 41 లక్షలు వసూలు కాగా మొత్తంగా 10 రోజులకు రూ. 8.25 కోట్లు షేర్, రూ. 14.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vijay Antony Bichagadu 2 Movie 10 Days Worldwide Box Office Collection

వరల్డ్ వైడ్ గా: తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో రూ. రూ. 14.65 కోట్లు గ్రాస్ రాబట్టిన 'బిచ్చగాడు 2' సినిమా వరల్డ్ వైడ్ గా క్రేజీగా వసూళ్లు తెచ్చిపెట్టింది. తమిళనాడులో రూ. 13.85 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా బిచ్చగాడు 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో రూ. 15.27 కోట్లు షేర్‌, రూ. 30.80 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

Vijay Antony Bichagadu 2 Movie 10 Days Worldwide Box Office Collection

హిట్ కావాలంటే?: విజయ్ ఆంటోనీ లేటేస్ట్ మూవీ బిచ్చగాడు 2కి తెలుగులో రూ. 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఈ లక్ష్యాన్ని చేరుకున్న ఈ సినిమా అదనంగా రూ. 1.75 కోట్లు లాభం అందుకుని తెలుగులో హిట్ గా నిలిచింది. కానీ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ రూ. 16 కోట్లు కాగా ఇప్పటికీ రూ. 14.65 కోట్లు వసూళు చేసింది. అంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్ కావాలంటే ఇంకా రూ. 73 లక్షలు రాబట్టాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X