Bichagadu 2 Collection: బిచ్చగాడు 2కి పెరుగుతున్న లాభాలు.. ఎక్కడెక్కడ ఎంత ఫ్రాఫిట్ అంటే?

తమిళ హీరో విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ తర్వాత చిన్న సినిమాల్లో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో మాస్ మహారాజా దరువు సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయిన విజయ్ ఆంటోనీ ఇటీవలే బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బిచ్చగాడు 2 మూవీ 16వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

అన్నీ ఒక్కడై: 2014లో వచ్చిన బిచ్చాగాడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తమిళంలో కంటే ఎక్కువగా తెలుగులో కలెక్షన్స్ రాబట్టింది. ఆ మూవీకి సీక్వెల్ గా తాజాగా బిచ్చగాడు 2 (తమిళంలో పిచ్చైక్కారన్ 2)గా విడుదలైంది. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా చేయగా.. హీరో, దర్శకత్వం, మ్యూజిక్, ఎడిటింగ్ తదితర బాధ్యతలను అన్నీ తానై నిర్వహించాడు విజయ్ ఆంటోనీ

Vijay Antony Bichagadu 2 Movie 16 Days Worldwide Box Office Collection

ప్రీ రిలీజ్ బిజినెస్: డబ్బింగ్ చిత్రాల ద్వారా విజయ్ ఆంటోనికి ఏపీ తెలంగాణలోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. ఆయన మార్కెట్ కు తగినట్లుగానే బిచ్చగాడు 2 ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 6 కోట్లు మేర బిజినెస్‌ చేసింది బిచ్చగాడు 2. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, ఏరియాల్లో కలిపి రూ. 15 కోట్లు వరకూ బిజినెస్ అయిందని సమాచారం. దీంతో బ్రేక్ ఈవెన్ రూ. 16 కోట్లుగా ఫిక్స్ అయింది.

Vijay Antony Bichagadu 2 Movie 16 Days Worldwide Box Office Collection

16వ రోజు వసూళ్లు: బిచ్చగాడు 2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఓసారి తగ్గుతూ.. మరోసారి పెరుగుతూ వస్తున్నాయి. 15వ రోజుతో పోలిస్తే 16వ రోజున అంటే శనివారం నాడు కలెక్షన్స్ పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్‌, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 12 లక్షలు షేర్ కలెక్ట్ చేసింది ఈ సినిమా.

Vijay Antony Bichagadu 2 Movie 16 Days Worldwide Box Office Collection

16 రోజుల్లో వచ్చింది: సీక్వెల్ గా వచ్చిన బిచ్చగాడు 2కి 16 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన స్పందన బాగుంది. ఫలితంగా నైజాంలో రూ. 3.13 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.39 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.34 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 76 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 54 లక్షలు, గుంటూరులో రూ. 76 లక్షలు, కృష్ణాలో రూ. 76 లక్షలు, నెల్లూరులో రూ. 45 లక్షలు వసూలు అయింది. మొత్తంగా 16 రోజుల్లో రూ. 9.13 కోట్లు షేర్, రూ. 16.43 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vijay Antony Bichagadu 2 Movie 16 Days Worldwide Box Office Collection

వరల్డ్ వైడ్ గా: తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో రూ. రూ. 16.43 కోట్లు గ్రాస్ రాబట్టిన 'బిచ్చగాడు 2' సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రేజీగా వసూళ్లు తెచ్చిపెట్టింది. తమిళనాడులో రూ. 14.82 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.15 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా బిచ్చగాడు 2 మూవీ వరల్డ్ వైడ్ గా 16 రోజుల్లో రూ. 16.70 కోట్లు షేర్‌, రూ. 33.65 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

Vijay Antony Bichagadu 2 Movie 16 Days Worldwide Box Office Collection

లాభాలు ఎంతంటే?: విజయ్ ఆంటోనీ తాజా సినిమా బిచ్చగాడు 2కి తెలుగులో రూ. 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఈ లక్ష్యాన్ని చేరుకున్న ఈ మూవీ అదనంగా రూ. 2.63 కోట్లు లాభం అందుకుని తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ రూ. 16 కోట్లు కాగా ఇప్పటికీ రూ. 16.70 కోట్లు వసూళు చేసింది. అంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 70 లక్షల ఫ్రాపిట్ అందుకుని హిట్ గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X