Bichagadu 2 Collection: బిచ్చగాడు 2కు షాకింగ్ కలెక్షన్స్.. తెలుగులో లాభాలు.. తమిళంలో మాత్రం!
విభిన్న జోనర్ లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోని. పేరుకు కోలీవుడ్ హీరో అయిన విజయ్ ఆంటోనికి తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయన్ను ఇక్కడివారు గుర్తు పెట్టుకునేలా చేసిన సినిమా బిచ్చగాడు.
2014లో వచ్చిన ఈ సినిమాతో తెలుగు వాడు అయిపోయాడు విజయ్. దానికి సీక్వెల్ గా బిచ్చగాడు 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కాసులు పోగేసుకుంటున్నాడు. ఈ క్రమంలో బిచ్చగాడు 6వ రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ పరుగులు: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా బిచ్చగాడు 2. దీన్నే తమిళంలో పిచ్చకారన్ 2గా పిలుస్తారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు విజయ్ ఆంటోనీనే మ్యూజిక్ అందించడం మరో విశేషం. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సీక్వెల్ మూవీ బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది.

ప్రీ రిలీజ్ బిజినెస్: అనువాద చిత్రాల ద్వారా విజయ్ ఆంటోనికి తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. ఆయన మార్కెట్ కు తగినట్లుగానే బిచ్చగాడు 2 ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. ఏపీ తెలంగాణలో రూ. 6 కోట్లు మేర బిజినెస్ చేసింది బిచ్చగాడు 2. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు వరకూ బిజినెస్ అయిందని సమాచారం. దీంతో బ్రేక్ ఈవెన్ రూ. 16 కోట్లుగా ఫిక్స్ అయింది.

6వ రోజు కలెక్షన్స్: బిచ్చగాడు 2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా 6వ రోజు కూడా మరింతగా డౌన్ అయ్యాయి. దీంతో నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలు వసూలైంది. అన్ని కలిపి రూ. 32 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ వచ్చింది.

6 రోజుల్లో: సీక్వెల్ మూవీ బిచ్చగాడు 2కి 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన స్పందన పర్వాలేదనిపిస్తోంది. నైజాంలో రూ. 2.39 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 59 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, గుంటూరులో రూ. 60 లక్షలు, కృష్ణాలో రూ. 56 లక్షలు, నెల్లూరులో రూ. 36 లక్షలు కలెక్ట్ కాగా మొత్తంగా 6 రోజులకు రూ. 7.25 కోట్లు షేర్, రూ. 12.70 కోట్లు గ్రాస్ వచ్చింది.
వరల్డ్ వైడ్ గా: తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో రూ. రూ. 12.70 కోట్లు గ్రాస్ రాబట్టిన 'బిచ్చగాడు 2' సినిమా వరల్డ్ వైడ్ గా క్రేజీ వసూళ్లు తెచ్చిపెట్టింది. తమిళనాడులో రూ. 11.65 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.04 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.03 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా బిచ్చగాడు 2 ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో రూ. 13.02 కోట్లు షేర్, రూ. 26.42 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

తెలుగులో హిట్.. కానీ: విజయ్ ఆంటోనీ లేటేస్ట్ మూవీ బిచ్చగాడు 2కి తెలుగులో రూ. 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఈ లక్ష్యాన్ని చేరుకున్న ఈ సినిమా అదనంగా రూ. 75 లక్షలు ప్రాఫిట్ అందుకుని తెలుగులో హిట్ గా నిలిచింది. కానీ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ రూ. 16 కోట్లు కాగా ఇప్పటికీ రూ. 13.02 కోట్లు వసూళు చేసింది. అంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్ కావాలంటే ఇంకా రూ. 2.98 కోట్లు రాబట్టాలి.


Click it and Unblock the Notifications











