Bichagadu 2 Collections: బిచ్చగాడు సెన్సేషన్.. తగ్గినా లాభాలతో అరాచకం.. అన్ని లక్షలు వస్తే రికార్డే
కంటెంట్ బాగుంటే ఏ భాషలో రూపొందిన సినిమానైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. అలా ఏడేళ్ల క్రితం వచ్చి.. మన దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రమే 'బిచ్చగాడు'. అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌గా 'బిచ్చగాడు 2'ను తెరకెక్కించారు.
ఇది కూడా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అవగా.. తమిళంలో విజయానికి చేరువగా వచ్చింది. ఈ నేపథ్యంలో 'బిచ్చగాడు 2' మూవీ 11 రోజుల కలెక్షన్లను చూద్దాం పదండి!

'బిచ్చగాడు' మళ్లీ వచ్చాడుగా: తమిళ పరిశ్రమకు చెందిన విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'బిచ్చగాడు 2'. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే మ్యూజిక్ కూడా ఇచ్చాడు. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన దీన్ని ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు.

బిచ్చగాడు 2 బిజినెస్ వివరాలు: సంచలన విజయాన్ని అందుకున్న చిత్రానికి సీక్వెల్ కావడంతో 'బిచ్చగాడు 2'పై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్‌ను చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు బిజినెస్ చేసింది.

11వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: విజయ్ ఆంటోనీ - కావ్య తాపర్ జంటగా నటించిన 'బిచ్చగాడు 2' మూవీకి తెలుగులో ఆరంభం నుంచే వసూళ్లు బాగా వస్తున్నాయి. దీంతో ఇది టార్గెట్‌ను ఇప్పటికే పూర్తి చేసుకుంది. మధ్యలో తగ్గినా రెండో వీకెండ్‌లో మళ్లీ పెరిగాయి. ఇలా 10వ రోజు ఈ చిత్రం రూ. 40 లక్షలు రాబట్టింది. అయితే, 11వ రోజు మాత్రం సగం డౌన్ అయి రూ. 21 లక్షలు మాత్రమే వసూలు చేసింది.

11 రోజులకూ కలిపి ఎంతొచ్చింది: 'బిచ్చగాడు 2'కి తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 2.86 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.31 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.27 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 70 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 50 లక్షలు, గుంటూరులో రూ. 70 లక్షలు, కృష్ణాలో రూ. 70 లక్షలు, నెల్లూరులో రూ. 42 లక్షలతో కలిపి.. రూ. 8.46 కోట్లు షేర్, రూ. 15.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఏపీ, తెలంగాణలో రూ. 15.05 కోట్లు గ్రాస్ రాబట్టిన 'బిచ్చగాడు 2' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో తమిళనాడులో రూ. 14.05 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.10 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో రూ. 15.59 కోట్లు షేర్, రూ. 31.42 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

టార్గెట్ ఎంత? లాభం ఎంత?: 'బిచ్చగాడు 2' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.00 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో దీనికి రూ. 15.59 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 41 లక్షలు రాబడితేనే ఈ మూవీ హిట్ అవుతుంది. తెలుగులో రూ. 6.50 కోట్లు టార్గెట్‌కు రూ. 8.46 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ. 1.96 కోట్లు లాభం వచ్చింది.
అన్ని లక్షలు వస్తే రికార్డు: సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'బిచ్చగాడు 2' మూవీ ఓవరాల్‌గా విజయాన్ని అందుకోవడానికి కూడా చేరువగా వచ్చింది. ఇంకా ఈ చిత్రం రూ. 41 లక్షలు రాబడితే టార్గెట్‌ను చేరుకుని క్లీన్ హిట్‌గా రికార్డు సాధిస్తుంది. అలాగే, తెలుగులో మరో రూ. 4 లక్షలు షేర్ వస్తే.. ఈ సినిమా రూ. 2 కోట్లు లాభాల మార్కును కూడా చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











