Bichagadu 2 Collections: బిచ్చగాడు మరో సెన్సేషన్.. అన్ని కోట్ల టార్గెట్ ఔట్.. తెలుగు లాభాలు చూస్తే!
తమిళంలో రూపొందే చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. అందులోనూ మంచి కంటెంట్‌తో వచ్చే వాటికి ఇంకాస్త ఎక్కువ రెస్పాన్స్ వస్తుంటుంది. అలా 2016లో వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న సినిమానే 'బిచ్చగాడు'.
అప్పట్లో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీకి ఇప్పుడు 'బిచ్చగాడు 2' సీక్వెల్‌గా వచ్చింది. దీనికి కూడా తెలుగులో మంచి ఆదరణ వచ్చి హిట్టైంది. అలాగే, తాజాగా తమిళంలోనూ విజయం సాధించింది. మరి 'బిచ్చగాడు 2' మూవీ 13 రోజుల కలెక్షన్లను మీరే చూడండి!

మళ్లీ వచ్చేసిన 'బిచ్చగాడు': తమిళ పరిశ్రమకు చెందిన విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'బిచ్చగాడు 2'. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే మ్యూజిక్ కూడా ఇచ్చాడు. హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన దీన్ని ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు.

బిచ్చగాడు 2 బిజినెస్ వివరాలు: సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్‌గా రావడంతో 'బిచ్చగాడు 2'పై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్‌ను చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు బిజినెస్ జరిగింది.

13వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: విజయ్ ఆంటోనీ - కావ్య తాపర్ జంటగా నటించిన 'బిచ్చగాడు 2' మూవీకి తెలుగులో ఆరంభం నుంచే వసూళ్లు బాగా వస్తున్నాయి. దీంతో ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంది. ఇక, ఈ వారంలో దీనికి వసూళ్లు క్రమంగా డౌన్ అవుతోన్నాయి. ఇక, 12వ రోజు రూ. 20 లక్షలు రాబట్టిన ఈ చిత్రం.. 13వ రోజు మాత్రం కాస్త డౌన్ అయి రూ. 16 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

13 రోజులకూ కలిపి ఎంతొచ్చింది: 'బిచ్చగాడు 2'కి 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.36 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.31 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 73 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 52 లక్షలు, గుంటూరులో రూ. 73 లక్షలు, కృష్ణాలో రూ. 73 లక్షలు, నెల్లూరులో రూ. 44 లక్షలతో కలిపి.. రూ. 8.82 కోట్లు షేర్, రూ. 15.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఏపీ, తెలంగాణలో రూ. 15.80 కోట్లు గ్రాస్ రాబట్టిన 'బిచ్చగాడు 2'.. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో తమిళనాడులో రూ. 14.55 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.12 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 13 రోజుల్లో రూ. 16.23 కోట్లు షేర్, రూ. 32.72 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

టార్గెట్ ఎంత? లాభం ఎంత?: 'బిచ్చగాడు 2' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.00 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లో దీనికి రూ. 16.23 కోట్లు వచ్చాయి. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 23 లక్షలు లాభాలు వచ్చాయి. తెలుగులో రూ. 6.50 కోట్లు టార్గెట్‌కు రూ. 8.82 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ. 2.32 కోట్లు లాభం వచ్చింది.

అన్ని కోట్లు టార్గెట్ ఫినీష్: విజయ్ ఆంటోనీ హీరోగా, దర్శకుడిగా చేసిన 'బిచ్చగాడు 2' మూవీ తెలుగులో మొదటి వారంలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ, తమిళంలో మాత్రం ఇది అంతగా రాణించలేదు. దీంతో నష్టాలతోనే రన్‌ను ముగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ చిత్రం ఓవరాల్‌గా విజయాన్ని అందుకుని లాభాల బాటలో పయనిస్తోంది.


Click it and Unblock the Notifications











