Bichagadu 2 Collections: బిచ్చగాడు మాస్ కొట్టుడు.. 15 రోజుల్లో అన్ని కోట్లు.. లాభాలతో మరో రికార్డు
తమిళ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తుందన్న విషయం తెలిసిందే. ఇలా చాలా కాలంగా కోలీవుడ్‌లో రూపొందిన కొన్ని మూవీలు టాలీవుడ్‌లో సందడి చేసి సక్సెస్ అవుతున్నాయి. అలా 2016లో వచ్చి భారీ విజయాన్ని అందున్న చిత్రమే 'బిచ్చగాడు'. తమిళంలో కంటే తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ మూవీకి ఇప్పుడు 'బిచ్చగాడు 2' సీక్వెల్‌గా వచ్చింది. ఇది కూడా రెండు భాషల్లో హిట్ అయింది. కానీ, తెలుగులో ఎక్కువ లాభాలను అందుకుంది. ఈ నేపథ్యంలో 'బిచ్చగాడు 2' మూవీ 15 రోజుల కలెక్షన్లను మీరే చూడండి మరి!
'బిచ్చగాడు'గా విజయ్ ఆంటోనీ: విజయ్ ఆంటోనీ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన చిత్రమే 'బిచ్చగాడు 2'. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే మ్యూజిక్ కూడా ఇచ్చాడు. హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన దీన్ని ఫాతిమా విజయ్ ఆంటోనీ భారీగానే నిర్మించారు.

బిచ్చగాడు 2 బిజినెస్ వివరాలు: హిట్ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన 'బిచ్చగాడు 2'పై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్‌ను చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు బిజినెస్‌ను కూడా జరుపుకుంది.
15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: విజయ్ ఆంటోనీ - కావ్య తాపర్ జంటగా నటించిన 'బిచ్చగాడు 2' మూవీకి తెలుగులో ఆరంభం నుంచే వసూళ్లు బాగా వస్తున్నాయి. దీంతో ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంది. ఇక, 2 వారం నుంచి దీనికి వసూళ్లు డౌన్ అవుతూనే ఉన్నాయి. ఇక, 14వ రోజు రూ. 11 లక్షలు రాబట్టిన ఈ చిత్రం.. 15వ రోజు మాత్రం ఇంకాస్త డౌన్ అయి రూ. 8 లక్షలు షేర్‌ను మాత్రమే కలెక్ట్ చేసింది.

15 రోజులకు కలిపి ఎంతొచ్చింది: 15 రోజుల్లో 'బిచ్చగాడు 2'కి తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 3.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.38 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.33 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 75 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, గుంటూరులో రూ. 75 లక్షలు, కృష్ణాలో రూ. 75 లక్షలు, నెల్లూరులో రూ. 44 లక్షలతో కలిపి.. రూ. 9.01 కోట్లు షేర్, రూ. 16.18 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఏపీ, తెలంగాణలో రూ. 16.18 కోట్లు గ్రాస్ రాబట్టిన 'బిచ్చగాడు 2'.. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో తమిళనాడులో రూ. 14.75 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.14 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 15 రోజుల్లో రూ. 16.53 కోట్లు షేర్, రూ. 33.32 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

టార్గెట్ ఎంత? లాభం ఎంత?: 'బిచ్చగాడు 2' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.00 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లో దీనికి రూ. 16.53 కోట్లు వచ్చాయి. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 53 లక్షలు లాభాలు వచ్చాయి. తెలుగులో రూ. 6.50 కోట్లు టార్గెట్‌కు రూ. 9.01 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ. 2.51 కోట్లు లాభం వచ్చింది.


Click it and Unblock the Notifications











