Bichagadu 2 Collection: తెలుగును అందుకోని తమిళ కలెక్షన్స్.. బిచ్చగాడు 2కి లాభాలు తెలిస్తే?
విభిన్న జోనర్ లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోని. పేరుకు కోలీవుడ్ హీరో అయిన విజయ్ ఆంటోనికి తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. నిజానికి ఆయన్ను తెలుగు ఆడియెన్స్ గుర్తు పెట్టుకునేలా చేసిన సినిమా బిచ్చగాడు. 2014లో వచ్చిన ఈ సినిమాతో తెలుగు వాడు అయిపోయాడు విజయ్. దానికి సీక్వెల్ గా బిచ్చగాడు 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కాసులు పోగేసుకుంటున్నాడు. ఈ క్రమంలో బిచ్చగాడు 17వ రోజు వసూళ్లపై ఓ లుక్కేస్తే..
బిచ్చగాడు 3 కూడా: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకున్న సినిమా బిచ్చగాడు 2. దీన్నే తమిళంలో పిచ్చకారన్ 2గా తమిళంలో పిలుస్తారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు విజయ్ ఆంటోనీనే మ్యూజిక్ అందించడం మరో విశేషం. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సీక్వెల్ మూవీకి మరో సీక్వెల్ ఉంటుందని హీరో తెలిపాడు.

ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్: మొదట్లో మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ తర్వాత చిన్న సినిమాలతో హీరోగా అట్రాక్ట్ చేశాడు. దీంతో ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకు తగినట్లుగానే బిచ్చగాడు 2 ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. ఏపీ తెలంగాణలో రూ. 6 కోట్లు మేర బిజినెస్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు వరకూ బిజినెస్ అయిందని సమాచారం. దీంతో బ్రేక్ ఈవెన్ రూ. 16 కోట్లుగా ఫిక్స్ అయింది.

17వ రోజు కలెక్షన్స్: బిచ్చగాడు 2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు బాగానె కలెక్ట్ అవుతున్నాయి. ఇక 17వ రోజైనా ఆదివారం నాడు రూ. 5 లక్షల వసూళ్లు పెరిగాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 17 లక్షలు షేర్ కలెక్ట్ చేసింది బిచ్చగాడు 2 ఈ సినిమా.

17 రోజుల్లో: సీక్వెల్ మూవీ బిచ్చగాడు 2కి 17 రోజుల్లో తమిళంలో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే స్పందన ఎక్కువగా ఉంది. నైజాంలో రూ. 3.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.41 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.36 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 78 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 78 లక్షలు, కృష్ణాలో రూ. 78 లక్షలు, నెల్లూరులో రూ. 46 లక్షలు కలెక్ట్ కాగా మొత్తంగా 17 రోజులకు రూ. 9.30 కోట్లు షేర్, రూ. 16.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

వరల్డ్ వైడ్ గా: తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో రూ. రూ. 16.80 కోట్లు గ్రాస్ రాబట్టిన 'బిచ్చగాడు 2' సినిమా వరల్డ్ వైడ్ గా వసూళ్లు బాగానే సాధిస్తోంది. తమిళనాడులో రూ. 15 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.15 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా బిచ్చగాడు 2 ప్రపంచ వ్యాప్తంగా 17 రోజుల్లో రూ. 17 కోట్లు షేర్, రూ. 34.20 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అంటే 17వ రోజు కావొస్తున్న బిచ్చగాడు 2కి తమిళంలో కంటే తెలుగులోనే రూ. 1.80 కోట్లు ఎక్కువగా వచ్చాయి.

తెలుగులో ఎన్ని లాభాలు అంటే?: విజయ్ ఆంటోనీ లేటేస్ట్ మూవీ బిచ్చగాడు 2కి తెలుగులో రూ. 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఈ టార్గెట్ ఎప్పుడో అధిగమించిన ఈ సినిమా అదనంగా రూ. 2.80 కోట్ల లాభం అందుకుని తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 16 కోట్ల బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి.. కోటి రూపాయల ప్రాఫిట్ తో హిట్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











