Bichagadu 2 Collections: బిచ్చగాడు కుమ్మేశాడు.. 18 రోజుల్లో భారీగా.. లాభాలతో రికార్డులే రికార్డులు
సాధారణంగా సమ్మర్‌లో వచ్చే చిత్రాలకు హాలీడేస్ కారణంగా మంచి రెస్పాన్స్ లభిస్తుంటుంది. కానీ, ఈ ఏడాది మాత్రం టాలీవుడ్‌లో వేసవిలో వచ్చిన చిత్రాలు పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. ఈ పరిస్థితుల్లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రమే 'బిచ్చగాడు 2'.
ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ ఆదరణను అందుకుని సత్తా చాటింది. ఫలితంగా రెండు భాషల్లోనూ మంచి వసూళ్లను రాబట్టి.. లాభాల బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో 'బిచ్చగాడు 2' మూవీ 18 రోజుల కలెక్షన్లను మీరే చూడండి మరి!

'బిచ్చగాడు'గా మారిన హీరో: ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమానే 'బిచ్చగాడు 2'. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే మ్యూజిక్ కూడా ఇచ్చాడు. హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన దీన్ని ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు.

బిచ్చగాడు 2 బిజినెస్ వివరాలు: క్రేజీ సక్సెస్ సాధించిన మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'బిచ్చగాడు 2'పై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్‌ను చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 18 కోట్లు బిజినెస్ చేసింది.

18వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: విజయ్ ఆంటోనీ - కావ్య తాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన 'బిచ్చగాడు 2' మూవీకి తెలుగులో ఆరంభం నుంచే వసూళ్లు బాగా వస్తున్నాయి. దీంతో ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంది. ఇక, 2 వారం నుంచి దీనికి వసూళ్లు డౌన్ అవుతూనే ఉన్నాయి. ఇక, 17వ రోజు రూ. 17 లక్షలు రాబట్టిన ఈ చిత్రం.. 18వ రోజు మాత్రం సగానికి సగం పడిపోయి రూ. 8 లక్షలు షేర్‌నే కలెక్ట్ చేసింది.

18 రోజులకు కలిపి ఎంతొచ్చింది: 'బిచ్చగాడు 2'కి 18 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 3.22 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.42 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.36 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 78 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 79 లక్షలు, కృష్ణాలో రూ. 79 లక్షలు, నెల్లూరులో రూ. 47 లక్షలతో కలిపి.. రూ. 9.38 కోట్లు షేర్, రూ. 17.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఏపీ, తెలంగాణలో రూ. 17.00 కోట్లు గ్రాస్ రాబట్టిన 'బిచ్చగాడు 2'.. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో తమిళనాడులో రూ. 15.08 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.15 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 18 రోజుల్లో రూ. 17.13 కోట్లు షేర్, రూ. 34.48 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

టార్గెట్ ఎంత? లాభం ఎంత?: 'బిచ్చగాడు 2' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.00 కోట్లుగా నమోదైంది. ఇక, 18 రోజుల్లో దీనికి రూ. 17.13 కోట్లు వచ్చాయి. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.13 కోట్లు లాభాలు వచ్చాయి. తెలుగులో రూ. 6.50 కోట్లు టార్గెట్‌కు రూ. 9.38 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ. 2.88 కోట్లు లాభం వచ్చింది.


Click it and Unblock the Notifications











