Bichagadu 2 Day 7 Collections: తెలుగులో బిచ్చగాడు సంచలనం.. వారంలోనే భారీ లాభాలు.. అక్కడ మాత్రం!

2016లో విడుదలైన ఓ డబ్బింగ్ సినిమా తెలుగులో సెన్సేషన్ అయింది. దీంతో ఆ చిత్రానికి భారీ కలెక్షన్లు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అదే విజయ్ ఆంటోనీ నటించిన 'బిచ్చగాడు'. ఇది విజయం సాధించడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'బిచ్చగాడు 2' అనే సినిమాను తీశారు. ఈ మూవీ కూడా తెలుగు, తమిళంలో విడుదలైంది. దీనికి మన దగ్గర మంచి స్పందన వచ్చి సక్సెస్ సాధించగా.. తమిళంలో మాత్రం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అసలు 'బిచ్చగాడు 2' మూవీ రెండు వెర్షన్లకు ఎంత కలెక్షన్ వచ్చిందో మీరే చూసేయండి మరి!

'బిచ్చగాడు 2' అంటూ కొత్తగా
విజయ్ ఆంటోనీ హీరోగా నటించడంతో పాటు తెరకెక్కించిన చిత్రమే 'బిచ్చగాడు 2'. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాను ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే సంగీతాన్ని సమకూర్చాడు.

Bichagadu 2

బిచ్చగాడు 2 బిజినెస్ వివరాలు
హిట్టైన సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన 'బిచ్చగాడు 2'పై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు వరకూ వ్యాపారాన్ని చేసుకుంది.

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: 'బిచ్చగాడు 2' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 7వ రోజు వసూళ్లు మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 20 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ వచ్చింది.

Vijay Antony

7 రోజులకూ కలిపి ఎంతొచ్చింది: వారంలో 'బిచ్చగాడు 2'కి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 2.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.21 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.17 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 61 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 44 లక్షలు, గుంటూరులో రూ. 62 లక్షలు, కృష్ణాలో రూ. 58 లక్షలు, నెల్లూరులో రూ. 37 లక్షలతో కలిపి.. రూ. 7.45 కోట్లు షేర్, రూ. 13.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఏపీ, తెలంగాణలో రూ. 13.10 కోట్లు గ్రాస్ రాబట్టిన 'బిచ్చగాడు 2' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో తమిళనాడులో రూ. 12.05 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.08 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.05 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో రూ. 13.45 కోట్లు షేర్‌, రూ. 27.28 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

తెలుగులో హిట్.. అక్కడ మత్రం: 'బిచ్చగాడు 2' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.00 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 13.45 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.55 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ అవుతుంది. తెలుగులో రూ. 6.50 కోట్లు టార్గెట్‌కు రూ. 7.45 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ. 95 లక్షలు లాభం వచ్చింది.

Vijay Antony

తెలుగులో హిట్.. అక్కడ ఫట్టేనా: విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'బిచ్చగాడు 2' మూవీ తెలుగులో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. దీంతో ఇది క్లీన్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు, వారంలోనే దాదాపు కోటి రూపాయల వరకూ లాభాలను కూడా సొంతం చేసుకుంది. కానీ, తమిళ వెర్షన్ మాత్రం నిరాశ పరిచింది. అలాగే, ఓవరాల్‌గా ఈ చిత్రం కాస్త నష్టాలను ఎదుర్కొనే అవకాశమే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X