Bichagadu 2 Collections: బిచ్చగాడు మళ్లీ కొట్టాడు.. 2 వారాల్లోనే అన్ని కోట్లు.. లాభాలతో సెన్సేషన్

ఈ మధ్య కాలంలో సౌతిండియా మొత్తంలో మారుమ్రోగిపోతోన్న సినిమా పేర్లలో 'బిచ్చగాడు 2' ఒకటి. అంతలా ఈ తమిళ చిత్రం విడుదలకు ముందు నుంచే భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగులో ముందే హిట్టైన ఈ చిత్రం.. తమిళంలో తాజాగా టార్గెట్‌ను చేరుకుంది. దీంతో అన్ని చోట్లా లాభాలను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 'బిచ్చగాడు 2' మూవీ 2 వారాల కలెక్షన్లను మీరే చూడండి!

'బిచ్చగాడు'గా వచ్చిన హీరో:ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'బిచ్చగాడు 2'. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే మ్యూజిక్ కూడా ఇచ్చాడు. హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన దీన్ని ఫాతిమా విజయ్ ఆంటోనీ భారీగానే నిర్మించారు.

Vijay Antony Starrer Bichagadu 2 Movie 2 Weeks Worldwide Official Collections

బిచ్చగాడు 2 బిజినెస్ వివరాలు :'బిచ్చగాడు' మూవీకి సీక్వెల్‌గా రూపొందిన 'బిచ్చగాడు 2'పై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్‌ను చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు బిజినెస్ అయింది.

Vijay Antony Starrer Bichagadu 2 Movie 2 Weeks Worldwide Official Collections

14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:విజయ్ ఆంటోనీ - కావ్య తాపర్ హీరో హీరోయిన్లుగా చేసిన 'బిచ్చగాడు 2' మూవీకి తెలుగులో ఆరంభం నుంచే వసూళ్లు బాగా వస్తున్నాయి. దీంతో ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంది. ఇక, ఈ వారంలో దీనికి వసూళ్లు డౌన్ అవుతూనే ఉన్నాయి. ఇక, 13వ రోజు రూ. 16 లక్షలు రాబట్టిన ఈ చిత్రం.. 14వ రోజు మాత్రం ఇంకాస్త డౌన్ అయి రూ. 11 లక్షలు షేర్‌ను మాత్రమే కలెక్ట్ చేసింది.

2 వారాలకూ కలిపి ఎంతొచ్చింది:'బిచ్చగాడు 2'కి 2 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 3.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.37 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.32 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 74 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, గుంటూరులో రూ. 74 లక్షలు, కృష్ణాలో రూ. 74 లక్షలు, నెల్లూరులో రూ. 44 లక్షలతో కలిపి.. రూ. 8.93 కోట్లు షేర్, రూ. 16.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vijay Antony Starrer Bichagadu 2 Movie 2 Weeks Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:ఏపీ, తెలంగాణలో రూ. 16.00 కోట్లు గ్రాస్ రాబట్టిన 'బిచ్చగాడు 2'.. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో తమిళనాడులో రూ. 14.65 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.13 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 14 రోజుల్లో రూ. 16.39 కోట్లు షేర్‌, రూ. 33.03 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

Vijay Antony Starrer Bichagadu 2 Movie 2 Weeks Worldwide Official Collections

టార్గెట్ ఎంత? లాభం ఎంత?:'బిచ్చగాడు 2' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.00 కోట్లుగా నమోదైంది. ఇక, 2 వారాల్లో దీనికి రూ. 16.39 కోట్లు వచ్చాయి. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 39 లక్షలు లాభాలు వచ్చాయి. తెలుగులో రూ. 6.50 కోట్లు టార్గెట్‌కు రూ. 8.93 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ. 2.43 కోట్లు లాభం వచ్చింది.

Vijay Antony Starrer Bichagadu 2 Movie 2 Weeks Worldwide Official Collections

అక్కడి కంటే ఇక్కడే ఎక్కువగా:'బిచ్చగాడు 2' మూవీ తెలుగులో మొదటి వారంలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ, తమిళంలో మాత్రం ఇది అంతగా రాణించలేదు. దీంతో నష్టాలతోనే రన్‌ను ముగిస్తుందని అంతా అనుకున్నా ఈ చిత్రం అక్కడా హిట్ అయింది. మొత్తంగా చూస్తే.. రెండు వారాల్లో తెలుగులో రూ. 2.43 కోట్లు లాభాలను సాధిస్తే.. తమిళంలో కేవలం రూ. 39 లక్షల ప్రాఫిట్‌నే అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X