Bichagadu 2 Collections: బిచ్చగాడు ఊచకోత.. హిట్‌కు లక్షల దూరంలో.. ఏకైక తెలుగు సినిమాగా రికార్డు
2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు, తమిళంలోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమానే 'బిచ్చగాడు'. దీనికి ఇప్పుడు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం 'బిచ్చగాడు 2'. హిట్ మూవీకి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.
అందుకు తగ్గట్లుగానే ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇక, ఈ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ తాజాగా టార్గెట్‌ను ఫినీష్ చేసింది. మరి 'బిచ్చగాడు 2' మూవీ నాలుగు రోజుల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

'బిచ్చగాడు' మళ్లీ వచ్చేశాడు: విజయ్ ఆంటోనీ హీరోగా నటించి తెరకెక్కించిన క్రేజీ సినిమానే 'బిచ్చగాడు 2'. ఇందులో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాను ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే సంగీతాన్ని కూడా ఇచ్చాడు.

బిచ్చగాడు 2 బిజినెస్ వివరాలు: సక్సెస్‌ఫుల్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'బిచ్చగాడు 2' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు వరకూ వ్యాపారాన్ని జరుపుకుందని ట్రేడ్ టాక్.

4వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: 'బిచ్చగాడు 2' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 4వ రోజూ వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 65 లక్షలు షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

4 రోజులకూ కలిపి ఎంతొచ్చింది: 'బిచ్చగాడు 2'కి తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులూ మంచి స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 2.14 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.07 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 52 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 38 లక్షలు, గుంటూరులో రూ. 53 లక్షలు, కృష్ణాలో రూ. 49 లక్షలు, నెల్లూరులో రూ. 32 లక్షలతో కలిపి.. రూ. 6.47 కోట్లు షేర్, రూ. 11.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్లు గ్రాస్ రాబట్టిన 'బిచ్చగాడు 2' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో తమిళనాడులో రూ. 10.23 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 95 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 95 లక్షలు గ్రాస్ రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో రూ. 11.60 కోట్లు షేర్, రూ. 23.63 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?: 'బిచ్చగాడు 2' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.00 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 11.60 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 4.40 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ అవుతుంది. తెలుగులో రూ. 6.50 కోట్లు టార్గెట్‌కు రూ. 6.47 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ. 3 లక్షలు రావాలి.

అదే జరిగితే ఏకైక సినిమాగా: క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'బిచ్చగాడు 2' మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువగా వచ్చేసింది. ఇక, ఈరోజు కలెక్షన్లతో ఇది క్లీన్ హిట్‌గా నిలవబోతుంది. అదే జరిగితే ఈ ఏడాది మేలో హిట్టైన ఏకైక తెలుగు సినిమాగా ఇది రికార్డును క్రియేట్ చేయబోతుంది. అలాగే, ఈ ఏడాది విజయం సాధించిన 11వ సినిమాగానూ ఇది నిలవబోతుంది.


Click it and Unblock the Notifications











